బిరదవోలు ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థిగా ముడి రమ నామినేషన్
పొదలకూరు, రవి కిరణాలు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొదలకూరు మండలంలో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. మండలంలోని బిరదవోలు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముడి రమ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సిపి సర్వేపల్లి ఐటి వింగ్ అధ్యక్షులు రావుల ఇంద్రసేనా గౌడ్,పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకున్న ఆమె ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఆమెకు మద్దతు తెలిపారు. రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బిరదవోలు ఎంపీటీసీ స్థానంపై రాజకీయ ఆసక్తి నెలకొంది.
