హార్ముజ్.. కొత్త రూట్ దొరికినట్లేనా?
హార్ముజ్.. కొత్త రూట్ దొరికినట్లేనా?
హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షల వల్ల చిక్కుకుపోయిన మూడు భారీ నౌకలు తాజాగా సేఫ్‌గా బయటపడ్డాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి ఒక బిగ్ రిలీఫ్ అని నిపుణులు భావిస్తున్నారు. ఈ నౌకలు ఇరాన్ నిఘా కన్నుగప్పి ఇంటర్నేషనల్ షిప్పింగ్ లేన్స్‌ను కాదని ఒమన్ ప్రాదేశిక జలాల్లో నుంచి కొత్త మార్గాన్ని వెతుక్కుంటూ అరేబియా సముద్రంలోకి ప్రవేశించాయి. దీంతో మిగిలిన దేశాలు కూడా ఇదే రూట్‌ను ప్రత్యామ్నాయంగా చూసే అవకాశం ఉంది.