DECలోపు మరో 4.50 లక్షల ఇళ్లు: సీఎం


రాష్ట్రంలో పేదలకు ఇప్పటి వరకు 5.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చామని CM చంద్రబాబు తెలిపారు. డిసెంబర్‌లోపు మరో 4.50 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేస్తామని ప్రకటించారు. తిరుపతి(D) నాయుడుపేటలో ఆయన మాట్లాడుతూ ‘గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టినా ఫ్లాట్లను కేటాయించలేదు. వారికి రూ.174 కోట్లను తిరిగి చెల్లిస్తాం. ప్రతి పేదవాడికీ సొంతిల్లు ఇవ్వడమే మా లక్ష్యం’ అని వెల్లడించారు.