చంద్రబాబు తీవ్ర ఆగ్రహం


పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని CM చంద్రబాబు MLAలకు తేల్చిచెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తే ఎంతటి వారినైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రీసెంట్‌గా నరసారావుపేట MLA అరవింద బాబు తనకు కావాల్సిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వలేదని రచ్చ చేసిన నేపథ్యంలో CM ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, పార్టీకి చెడ్డపేరు తెచ్చే పనులు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.