ఇక ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ లోనే! వివిధ శాఖల సర్వీసులన్నీ వాట్సాప్తో లింక్
ఇక ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ లోనే!
వివిధ శాఖల సర్వీసులన్నీ వాట్సాప్తో లింక్
ఇప్పటికే మీ సేవ సర్వీసులు, టెన్త్, ఇంటర్ హాల్ టికెట్స్ కూడా ఇష్యూ
త్వరలోనే పలు పథకాలకూ ప్లాన్
రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్ బోర్డుల హాల్ టికెట్స్ ఇచ్చేలా ఏర్పాట్లు
ఒక్క నంబర్ 80969 58096 సేవ్ చేసుకుంటే చాలంటున్న ఆఫీసర్లు
డిజిటల్ విప్లవంతో ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకే తీసుకువచ్చేలా రాష్ట్ర సర్కార్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మీ సేవ సౌకర్యలు, ఇంటర్, పది పరీక్షల హాల్ టికెట్స్ను వాట్సాప్ లో అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. ఒక్కొక్కటి వివిధ శాఖల సర్వీసులను కూడా వాట్సాప్కు లింక్ చేస్తోంది. దీంతో ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సర్వీసు లింక్ ఒక్క వాట్సాప్ మెసేజ్తో ప్రత్యక్షం కానుంది. రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్ బోర్డులు కూడా భవిష్యత్తులో ఈ మార్గాన్ని అనుసరించేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. దీంతో అటు ఇంటర్నెట్ సెంటర్లు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగే పని లేకుండా కేవలం ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో పనులు చక్కబెట్టుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
దీని కోసం ప్రత్యేకంగా 80969 58096 అనే నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను కేంద్రీకృతం చేశారు. గతంలో వివిధ విభాగాలకు వేర్వేరుగా ఉన్న పోర్టళ్ల గందరగోళానికి స్వస్తి పలుకుతూ ఈ ఏకీకృత విధానాన్ని తెచ్చారు. ప్రజా ఫిర్యాదుల నుంచి సర్టిఫికెట్ల వరకు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చి విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. ఇది కేవలం సమాచారం కోసమే కాకుండా ప్రత్యక్ష సేవలు పొందే వేదికగా మార్చారు.
ప్రభుత్వ సందేశాలు, అలర్ట్స్ కూడా..
ఇటీవలే వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా ఈ వాట్సాప్ నంబర్ ద్వారా జారీ చేశారు. కేవలం రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, పేరు ఎంటర్ చేయగానే సెకన్ల వ్యవధిలో పీడీఎఫ్ రూపంలో హాల్ టికెట్ డౌన్‌లోడ్ అయింది. సాంకేతిక లోపాలు తలెత్తకుండా అత్యంత పటిష్టమైన సెక్యూరిటీ ప్రమాణాలతో ఈ డేటాను అనుసంధానం చేశారు. రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్ బోర్డులు కూడా భవిష్యత్తులో ఈ మార్గాన్ని అనుసరించేలా ప్రణాళికలు జరుగుతున్నాయి.
కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా ఫలితాలను సైతం ఇదే నంబర్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఇప్పటివరకు లక్షలాది మంది ఈ నంబర్‌ను సేవ్ చేసుకుని తమ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ సందేశాలు, అలర్ట్లు కూడా ఇకపై అధికారికంగా ఇదే వాట్సాప్ ఖాతా ద్వారా పౌరులకు చేరువవుతాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ విధానం ద్వారా మీ సేవ పోర్టల్‌లో లభించే దాదాపు అన్ని సేవలను పొందవచ్చు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల స్థితిగతులను తెలుసుకోవడం నుంచి మున్సిపల్ పన్నుల చెల్లింపు వరకు సాధ్యమవుతుంది.
వీటితో పాటు రెవెన్యూ, విద్యుత్, పౌరసరఫరాలు వంటి కీలక శాఖల సమాచారాన్ని అరచేతిలో ఉంచుకునే వీలు కల్పించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులే ప్రభుత్వంతో సంభాషించే అవకాశం ఉంటుంది. కేవలం 'హాయ్' అని మెసేజ్ పంపితే చాలు వివిధ ఆప్షన్లతో కూడిన మెనూ ప్రత్యక్షమై మార్గనిర్దేశం చేస్తుంది. దీంతో సమయం ఆదా అవ్వడమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంపై పని ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గుతుంది. అవినీతికి తావు లేకుండా ప్రతి అప్లికేషన్ ట్రాకింగ్ విధానం ద్వారా వేగంగా పనులు పూర్తయ్యేలా చూస్తున్నారు.
వన్ స్టాప్ షాప్' మాదిరిగా..
వచ్చే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ ఈ వాట్సాప్ చాట్‌బాట్‌కు అనుసంధానం చేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి వంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవడం, అర్హతను తనిఖీ చేయడం సులభం కానుంది. రేషన్ కార్డుల జారీ, పెన్షన్ల వివరాలు కూడా లబ్ధిదారులు తమ మొబైల్ నుంచే నిశితంగా పరిశీలించవచ్చు. ప్రభుత్వం నుంచి అందే నగదు బదిలీ సమాచారం కూడా ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో వచ్చేలా ప్లాన్ చేశారు. ప్రతి పౌరుడికి ఒకే నంబర్‌తో అన్ని సేవలు అందేలా 'వన్ స్టాప్ షాప్' విధానాన్ని అమలు చేస్తున్నారు. డిజిటల్ అసిస్టెంట్ తరహాలో ఈ వాట్సాప్ నంబర్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందిస్తుంది.