కూతురి అసభ్యకర ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపి..
నెల్లూరు: కూతురి అసభ్యకర ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపి..
ప్రకాశం(D), జరుగుమల్లి(M) గంగరాజుపాలేనికి చెందిన అశోక్ కుమార్ మూడేళ్ల క్రితం నెల్లూరుకు బేల్దారి పనుల కోసం వచ్చాడు. ఈక్రమంలో ఓ బాలికకు మాయమాటలు చెప్పి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు తీశాడు. అశోక్ కుమార్ ఆ బాలిక తండ్రికి రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండడంతో ఆయన నిలదీశాడు. దీంతో బాలిక ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపాడు. కేసు రుజువు కావడంతో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.9 వేల ఫైన్ విధించింది.