నెల్లూరు, రవి కిరణాలు :   కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నెల్లూరు 10వ డివిజన్ నుంచి పైడిమాని సుజన పోటి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న పైడిమాని సుజనను ప్రజలు ఆశీర్వదించాలని కోరిన..ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో  10వ డివిజన్ నుంచి  పోటి చేస్తున్న పైడిమాని సుజన బిజెపిని వీడి. వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్  ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పైడిమాని ఆదినారాయణ,సుజన, దంపతులకు పార్టీ కండువా వేసి. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  అనంతరం పైడిమాని సుజన కి  కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  పార్టీ బీఫామ్ అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న పైడిమాని సుజనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని  ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. పైడిమాని సుజనని గెలిపించి డివిజన్ అభివృద్ధికి. సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పైడిమాని ఆదినారాయణ ని. వైసిపి 10వ డివిజన్  అధ్యక్షులుగా నియమించినట్లు తెలిపారు.