ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలపై ఆరా.. అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :   నెల్లూరు నగరంలోని 66వ వార్డులో కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్, కార్పొరేటర్ అభ్యర్థి కప్పిర రేవతితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, నెల్లూరు నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు. నగరాభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగుతామని వారు వివరించారు.

ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానికులతో మమేకమవుతూ, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని రూప్ కుమార్, కప్పిర రేవతి ప్రజలను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.