కలెక్టరేట్‌ కంట్రోలు రూం నెంబర్లు : 0861 - 2331261, 79955 76699

నెల్లూరు, రవి కిరణాలు :  జిల్లాకు అర్నాబ్ తుఫాన్ హెచ్చరిక ఉన్నందున  ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఈ మేరకు   ఒక ప్రకటన విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలు,తీరా ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే  ముందస్తుగా ఏర్పాట్లు సిద్దం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్ళరాదని ఆయన సూచించారు. నీటిపారుదల, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్తు, ఆర్ అండ్ బి, పీఆర్, వ్యవసాయ, పశుసంవర్ధక, పంచాయతీ రాజ్, మున్సిపల్, శాఖలతో పాటు అన్ని లైన్ డిపార్ట్మెంట్లు 24/7 అప్రమత్తంగా ఉంటూ..తగు ముందస్తు  చర్యలు చేపట్టాలన్నారు.

కలెక్టరేట్‌లో కంట్రోలు రూం ఏర్పాటు

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోలు రూంను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ తెలిపారు. వర్షాల వలన ఇబ్బందులు తలెత్తితే కంట్రోలు రూం నెంబర్లు : 0861- 2331261, 79955 76699 నెంబర్ కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.  కంట్రోలు రూంలో 24 గంటలు విధులు నిర్వహించేలా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.