కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి తప్పిన పెను ప్రమాదం..దూసుకు వచ్చిన టపాసులు
October 28, 2026
Kotamreddy Giridhar Reddy narrowly escapes a major accident; firecrackers come hurtling towards him
నెల్లూరు, రవి కిరణాలు : నెల్లూరు రూరల్ పరిధిలోని 43వ డివిజన్ వేదాయపాలెం సెంటర్ నుంచి భారతీయ జనతా పార్టీ భారీ ర్యాలీ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. భారతీయ జనతా పార్టీ ర్యాలీలో పెద్ద ఎత్తున బాణసంచా ఏర్పాటు చేశారు. షార్ట్స్ , టపాసులు పేల్చడంతో అవి కిందపడి నేరుగా ర్యాలీలో కీలకంగా పాల్గొంటున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తో పాటు పక్కన ఉన్న వారిపై దూసుకు వచ్చాయి. నేరుగా ముఖాన్ని తాకడంతో గడ్డం, పెదాలకు టపాసులు తాకాయి.. తృటిలో కన్నుకు తగిలే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. టపాసులు బలంగా తాకడంతో ఇబ్బంది పడుతున్న ఆయన ర్యాలీలో మాత్రం కొనసాగారు... అక్కడి నుంచి చిన్నపాటి ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన కాసేపు విశ్రాంతి కోసం తీసుకొని తిరిగి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు
