కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి రాక

నెల్లూరు, రవి కిరణాలు :  నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు కలెక్టరేట్‌కు వచ్చారు.  ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తమ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిణామంతో నెల్లూరు జిల్లాలో ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కాయి.