సొంతింటి కల సాకారం చేసుకోండి
- పట్టణ ప్రాంతపేదలు ప్రధానమంత్రి ఆవాజ్ యోజన అర్బన్ 2. 0 పధకాన్ని సద్వినియోగం చేసుకోండి.
- అంగీకార్ 2025 బ్రోచర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.
పట్టణ ప్రాంతాలలో నివసించే పేదలు ప్రధానమంత్రి ఆవాజ్ యోజన అర్బన్ 2. 0 పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని ఆమె నివాసంలో హౌసింగ్ అధికారులతో కలిసి ప్రధానమంత్రి ఆవాజ్ యోజన అర్బన్ 2. 0 అంగీకార్ 2025 బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డి పాళెం పట్టణ వాసులకు ప్రధానమంత్రి ఆవాజ్ యోజన అర్బన్ 2. 0 పధకం వర్తిస్తుందన్నారు. సొంత ఇళ్ళు లేని పేదలు అక్టోబర్ 31 వరకు దఖాస్తులు చేసుకొని ప్రధానమంత్రి ఆవాజ్ యోజన అర్బన్ 2. 0 పధకం లబ్ది పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి వేణుగోపాలరావు, కోవూరు హౌసింగు డి ఇ వెంకటేశ్వర్లు రెడ్డి, బుచ్చిరెడ్డి పాళెం హౌసింగ్ ఎఇ కెసి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ ఛైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు విపిఆర్ నివాసంలో ఘనంగా జరిగాయి. మండలంలోని విడవలూరు రామతీర్థం ఊటుకూరు, దండిగుంట, వారిణి, పార్లపల్లి ముదివర్తి, రామచంద్రపురం, వావిళ్ళ గ్రామాల్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కేక్ కట్ చేసి వంశీ కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలువురు టిడిపి నాయకులు ఈ సంబరాల్లో పాల్గొని వంశీ కృష్ణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
సూళ్లూరుపేటలో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సెప్టెంబర్ 17: -
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బుధవారం స్థానిక సూళ్లూరుపేటలోని శివాలయము నందు వారికి ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలగాలని మరియు భారతదేశాన్ని , భారతదేశ ప్రజల యొక్క యోగక్షేమాలు మరియు వారికి సూపరిపాలన అందించే శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని బిజెపి కార్యకర్తలు ప్రార్థిస్తూ పూజాదికాలు నిర్వహించడం జరిగింది. మరియు వారి 75వ జయంతి సందర్భంగా 75 కొబ్బరికాయలను కొట్టడం జరిగింది.
పై కార్యక్రమానికి ఆలయ చైర్మన్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి సూళ్లూరుపేట అర్బన్ మండల సేవా పక్షోత్సవ కమిటీ ఇన్చార్జ్ ఆరని విజయభాస్కర్ రెడ్డి , జిల్లా కార్యదర్శి బెజవాడ విజయమ్మ, సీనియర్ నాయకులు తన్నీరు శేషగిరిరావు, సేవా పక్షోత్సవ అర్బన్ కమిటీ మెంబర్లు నూతలపాటి శ్రీనివాసులు, ఇంగిలాల సాగర్, పిచ్చుక సూరిబాబు, తుర్లపాటి శ్రీనివాసులు, కసంశెట్టి నిర్మలమ్మ, హైమావతి, మల్లికార్జునరెడ్డి , తడ మండలాధ్యక్షుడు తేజ రెడ్డి, రూరల్ సెక్రటరీ వాసు కుమార్ గౌడ్, అభిషేక్, దేవేందర్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, మొదలగువారు పాల్గొన్నారు.
తదనంతరం చెంగాలమ్మ తల్లి దేవాలయానికి వెళ్లి మోడీ పేరుతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చన చేయడం జరిగింది.
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు
ప్రతి పల్లెలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు
కూటమి ప్రభుత్వంలో మళ్లీ గాడిన పడిన రాష్ట్ర అభివృద్ధి
వైసీపీ నాయకులకు తెలిసింది అవినీతి, అక్రమాలతో క్యాష్ అండ్ క్యారీ మాత్రమే
సర్వేపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం
మనుబోలు మండలం పిడూరు పంచాయతీలో రూ.1.75 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
పిడూరులో పర్యటించిన సోమిరెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
రూ.1.20 కోట్లతో జాతీయ రహదారి నుంచి పిడూరు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
పిడూరు – యాచవరం మధ్యలో సప్లయ్ ఛానల్ పై రూ.40 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవం
రూ. 15 లక్షలతో రెండు సిమెంట్ రోడ్ల నిర్మాణం
రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు ట్రాక్ లో పడ్డాయి
వైసీపీ ఐదేళ్ల పాలన కక్షసాధింపులకు పరిమితమైంది.రైతులకు వ్యవసాయ పరికరాలు అందించడం, విద్యార్థులకు మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించడం వంటి పనులు వారికి తెలియదు.ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ విధానంలోనే ఐదేళ్లూ కొనసాగారు.కూటమి ప్రభుత్వంలో కక్షసాధింపులకు అవకాశం లేకుండా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్నాం .రాజకీయ ముద్ర వేసి పింఛన్లు తొలగించడం , యూరియా ఇవ్వకుండా ఆపడం, సంక్షేమ పథకాలు రద్దు చేయడం వంటి పనులు చేయవద్దని మా నాయకులకు స్పష్టంగా తెలియజేశాం. వైసీపీ పెద్ద మనుషులు చేసిన అక్రమాలను సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నాం.ప్రస్తుతం పిడూరు వరకు నిర్మిస్తున్న రహదారిని త్వరలోనే లక్ష్మీనరసాపురం, కాగితాలపూరు మీదుగా జాతీయ రమదారికి కలుపుతాం .రెండో దశలో ఆ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేస్తాం .యాచవరం బ్రిడ్జి వందలాది ఎకరాల రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది త్వరలోనే మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం .రూ.3 కోట్లతో మనుబోలులో హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుంటాం సంక్షేమ పథకాలు, అభివృద్ధి విషయంలో నిరుపేదలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం గతంలో ఎప్పుడూ లేని విధంగా పరిశ్రమల సీఎస్ఆర్ నిధులను సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయిస్తున్నాం
SPS నెల్లూరు జిల్లా:
తేది:17-09-2025
సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, మహమ్మదాపురం గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.గ్రామాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, యూరియా అందక, గిట్టుబాటు ధర లేక రైతులకు ఎదురవుతున్న గడ్డు పరిస్థితులు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించిన కాకాణి.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోగిరెడ్డి గోపాల్ రెడ్డి గారి తల్లి పెంచలమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న కాకాణి.
గ్రామాల్లో ప్రజలు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు.చంద్రబాబు సూపర్ సిక్స్ లో భాగంగా తాను ఇచ్చిన హామీలను కొన్నింటిని అసలు అమలు చేయకుండానే, మరికొన్నింటిని అరకొరగా అమలు చేస్తూ, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ సభలు, సమావేశాలు నిర్వహించడం హాస్యాస్పదం.చంద్రబాబు మాటల ముఖ్యమంత్రి కానీ, చేతల ముఖ్యమంత్రి కాదని రుజువు చేసుకున్నాడు.వరి పండించిన రైతులు గిట్టుబాటు ధర లేక నెల్లూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోతున్నారు.ధాన్యం రేట్లు రోజురోజుకి దిగజారి పోతున్నా, రైతుకు కనీస మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉల్లి ధర క్వింటాలు రూ౹౹3500/-లు ఉంటే, నేడు క్వింటాలు ధర 600/- రూపాయలకు దిగజారడం దౌర్భాగ్యం.రైతులు యూరియా అందక నానా అవస్థలు పడుతుంటే, చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతూ, కాలక్షేపం చేస్తున్నాడు.జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించి, నిర్మిస్తే, చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచి వేస్తుంది.చంద్రబాబు తన అనుకూల పత్రికల్లో ఎన్ని రకాల విష ప్రచారాలు చేసినా, పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం లేకుండా, వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లాడు. అనుభవజ్ఞుడు అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైంది.చంద్రబాబు లక్షల కోట్లు అప్పు తెచ్చి అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చేశాడు.చంద్రబాబు పాలన ప్రచార ఆర్భాటంలో "మిన్న" , కార్యరూపంలో "సున్న" అన్నట్లు తయారైంది.కూటమిపాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.ప్రతిపక్షంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, అన్ని విధాలా అండగా నిలుస్తాం.
ఘోర రోడ్డు ప్రమాదంపై ఎంపీ వేమిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కారును ఇసుక టిప్పర్ ఢీకొని ఏడుమంది మృత్యువాత పడటం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.ప్రమాదం తీవ్ర ఆవేదన మిగిల్చిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిసిన ఎంపీ వేమిరెడ్డి.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. క్షతగాత్రులకు తక్షణ సాయం అందించాలని ఆయన కోరారు.