నెల్లూరు నగరంలోని మూలపేట శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వేద మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు
మూలపేట శివాలయంలోని శ్రీ సూర్య భగవానుడిని దర్శించుకుని ప్రత్యేక అభిషేక పూజల్లో పాల్గొన్న మంత్రివర్యులు
జొన్నవాడ దేవస్థానం రేవు వద్ద స్థలం ఆక్రమణను తొలగించిన సీఐ
స్థలమునందు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన దేవస్థానం సిబ్బంది
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలసి ఉన్న ప్రసిద్ధి చెందిన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం పరిధిలోని జొన్నవాడ రేవు వద్ద దేవస్థానం నకు చెందిన స్థలంను కొందరు వ్యక్తులు ఆక్రమించి సదరు స్థలం నందు నిర్మాణములు చేపట్టుచున్నారని తెలిసి ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి సోమవారం ఉదయం నెల్లూరు రూరల్ సీఐ వేణు కి ఫిర్యాదు చేశారు. సీఐ వెంటనే స్పందించి వారి సిబ్బంది తో జొన్నవాడ రేవు వద్ద ఆక్రమణను తొలగించగా, దేవస్థాన సిబ్బంది సదరు స్థలం నందు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడమైనది.
డిప్యూటీ మేయర్‌గా తహసీన్
అధికారికంగా ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి కె కార్తీక్
ఓటింగ్ ద్వారా ఎన్నుకున్న కార్పొరేటర్లు
తహసీన్ కు ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు 41 మంది కార్పొరేటర్ల మద్దతు
వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు 12మంది కార్పొరేటర్ల మద్దతు
నెల్లూరు నగర అభివృద్ధి కోసం పనిచేస్తాను : డిప్యూటీ మేయర్ తహసీన్
వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లలో మేమే గెలుస్తాం : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
ఈ ఎన్నిక అప్రజాస్వామికం... న్యాయపరంగా కోర్టుకెళ్తాం : ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి
డిప్యూటీ మేయర్ తహసీన్‌కు మంత్రులు నారాయణ, ఆనం అభినందన.
నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్):
నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా 48వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ తహసీన్ ఎంపికయ్యారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ అధ్యక్షత వహించి కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశం మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షేక్ కరీముల్లాను కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసయాదవ్, వేలూరు ఉమా మహేష్ ప్రతిపాదించారు.ఇండిపెండెంట్ అభ్యర్థిగా 48వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ తహసీన్‌ను కార్పొరేటర్లు కరణం మంజుల, కర్తం ప్రతాప్‌రెడ్డి ప్రతిపాదించారు. ఇద్దరు అభ్యర్థులకు మద్దతుదారులు చేతులు ఎత్తి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. కరీముల్లాకు 12 ఓట్లు రాగా తహసీన్ కు 41 ఓట్లు వచ్చాయి. దీంతో డిప్యూటీ మేయర్ గా తహసీన్ ఎన్నికైనట్లు ప్రిసైడిరగ్ అధికారి కె. కార్తీక్ ప్రకటించారు. ఎన్నిక ప్రక్రియలో రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
నెల్లూరు నగర అభివృద్ధి కోసం పనిచేస్తాను : డిప్యూటీ మేయర్ తహసీన్
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సయ్యద్ తహసీన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు అవకాశం కల్పించిన మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎన్డీఎ కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటూ నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని ఆమె చెప్పారు.
వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లలో మేమే గెలుస్తాం : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరులోని 54 డివిజన్లలో మా అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేష్‌బాబుకు గిఫ్ట్‌గా అందిస్తామని చెప్పారు. డిప్యూటీ మేయర్‌గా తహసీన్‌ను ఎన్నుకునేందుకు సహకరించిన మంత్రి నారాయణ, కూటమి నేతలు, కార్పొరేటర్లు అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గెలుపోటములు సహజమని తాము ఎప్పుడూ ప్రజలతోనే వుంటామని చెప్పారు.
డిప్యూటీ మేయర్ తహసీన్‌కు మంత్రులు నారాయణ, ఆనం అభినందన
నెల్లూరు నగరపాలకసంస్థ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సయ్యద్ తహసీన్‌ను మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి అభినందించారు. డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన అనంతరం మంత్రి నారాయణ నివాసంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిని తహసీన్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు తహసీన్‌ను ప్రత్యేకంగా అభినందించి నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిప్యూటీ మేయర్ తహసీన్ ను అభినందించారు.
జిల్లా రైతులకు న్యాయం చేయాలి అధికారులకు మిమ్మల్ని సమర్పించిన మిడతల రమేష్
నెల్లూరు సిటీ మేజర్ న్యూస్
నెల్లూరు జిల్లా రైతులు మద్దతు ధర కోల్పోయి ధాన్యాన్ని నష్టానికి తెగనమ్ముకుంటున్న అధికారులురైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం నిర్లక్ష్యానికి అర్థం పడుతుందని అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నెల్లూరు జిల్లా పౌర సరఫరాల సంస్థ అసిస్టెంట్ మేనేజర్ సురేంద్రకు బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ మెమోరాండం ఇచ్చారు*
ఈ సందర్భంగా మిడతల రమేష్ మాట్లాడుతూ..
కేంద్రం ప్రకటించిన కనీస.మద్దతు ధర 19750 రూపాయలు ఉండగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రైతాంగం 16 వేల రూపాయలకు ధాన్యాన్ని తెగనమ్ముకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో
వ్యవసాయ కోతల సీజన్ ప్రారంభమైన ఇప్పటివరకు సంబంధిత అధికారులు రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారుల బాట పట్టారు .
నెల్లూరు జిల్లాలో గత వారం నుండి వరి కోతల ప్రారంభమయ్యాయి. తమ పంటను బిపిటి 16 వేల రూపాయలకు
కేఎన్ ఎం 17వేల రూపాయలకు విక్రయించుకుంటున్నారు
కొంతమంది మిల్లర్లు తేమతో సంబంధం లేకుండా 18 వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది .
ఈ సీజన్లో వ్యవసాయ పెట్టుబడులు రైతులు అధికంగా పెట్టారు. దిగుబడి కూడా గతంలో కంటే తక్కువగా వస్తూ ఉంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రైతులు వ్యవసాయం అంటే భయపడే పరిస్థితి ఉంది.
మరో 10 -15 రోజుల్లో జిల్లాలో ధాన్యం కోతలు ముమ్మరంగా జరుగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నిర్లక్ష్యం వహించింది. కనీసం మిల్లర్ల -రైతుల సమావేశం నిర్వహించి వాస్తవ సమస్యను అర్థం చేసుకోలేదు.
రైతు ప్రయోజనాలు కాపాడటం కోసం యుద్ధ ప్రాతిపదికన రైతు సేవ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతన్నలను ఆదుకోవాలని రమేష్ డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో నీలిచంటి లక్ష్మీనారాయణ ముని సురేష్ రాజేంద్ర కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు
మేమంతా ప్రశాంతమ్మ వెంటే
అభివృద్దే మా అజెండా అంటూ టిడిపికి జై కొట్టిన 12 మంది బుచ్చి వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు
అభివృద్దే మా అజెండా.. అందుకే ప్రశాంతమ్మ చెంతకు చేరాం.
ప్రశాంతమ్మ నాయకత్వంలోనే పని చేస్తాం.
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్: బుచ్చిరెడ్డి పాళెం వైసీపీ కౌన్సిలర్ల మదిలో అదేమాట. ఏడు నెలలుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి దంపతులు రాజకీయాలకు అతీతంగా చేస్తున్న సామాజిక కార్యక్రమాలు చూసారు. ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎంపిగా వేమిరెడ్డి ప్రభాకర్ కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు పడుతున్న తపన చూసాక వీళ్ళు మాటల మనుషులు కాదు చేతల మనుషులని తెలుసుకున్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కొట్లాటలు లేవు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసుల ఊసే లేదు. అభివృద్ధి తప్ప అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాల ప్రస్తావనే లేదు. అభివృద్ధి వైపు అడుగులేద్దాం అనుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు బుచ్చిరెడ్డి పాళెం మున్సిపల్ ఛైర్ పర్సన్ తో సహా మొత్తం 12 మంది వైసీపీ కొన్సిలర్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నాయకత్వంలో టిడిపి చెంతకు చేరారు. మోర్ల సుప్రజ (ఛైర్ పర్సన్ )కోటంరెడ్డి లలితమ్మ ( మాజీ వైస్ ఛైర్ పర్సన్ ) కత్తి నాగరాజు, అందే పెంచల ప్రత్యూష, షేక్ షేక్ రహమద్ భాష పఠాన్ నస్రీన్ ఖాన్ ఎరటపల్లి వెంకట శివకుమార్ రెడ్డి, బెలుం మల్లారెడ్డి, రాచూరు సత్యనారాయణ, పుట్ట లక్ష్మీకాంతమ్మ, చీర్ల ప్రసాద్, కత్తి శ్రీదేవి పలువురు బుచ్చి పట్టణ వైసీపీ ముఖ్య నాయకులు వైసీపీ వీడి ప్రశాంతమ్మ నాయకత్వంలో టిడిపికి జై కొట్టారు.
బుచ్చి వైస్ ఛైర్మన్లు టిడిపి వశం-కింగ్ మేకర్ గా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
వైస్ ఛైర్మన్లుగా గెలుపొందిన టిడిపి బలపరిచిన యరటపల్లి శివకుమార్ రెడ్డి, పఠాన్ నస్రీన్ ఖాన్
ఇది ముఖమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలన విజయం
పదవులు రాని వారు నిరుత్సాహ పడొద్దు
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
బుచ్చిరెడ్డిపాలెం ,మేజర్ న్యూస్:
ఉత్కంఠభరితంగా మారిన బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయతి వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన 8 వార్డు కౌన్సిలర్ పఠాన్ నస్రీన్ ఖాన్, 9 వ వార్డు కౌన్సిలర్ యరటపల్లి శివకుమార్ రెడ్డిలు వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లు వున్న బుచ్చి నగర పంచాయతీలో టిడిపి బలపరిచిన పఠాన్ నస్రీన్ ఖాన్, యరటపల్లి శివకుమార్ రెడ్డిలు వైసిపి వైస్ చైర్మన్ అభ్యర్థులు కందుకూరు యానాది రెడ్డి, ప్రమీలమ్మలపై 14 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ఎల్ శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యురాలి హోదాలో తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.బుచ్చి నగర పంవ్హాయతిలో వైస్ చైర్మన్ల గెలుపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజయంగా అభివర్ణించారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు జనరంజక పాలనకు ఆకర్షితులై బుచ్చి వైసిపి కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ వైపు అడుగులేశారన్నారు. ప్రజలతో మమేకమై పని చేసి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపాలని గెలుపొందిన వైస్ చైర్మన్లకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ప్రజలకోసం పని చేసి పదవులకు వన్నె తేవాలని వైస్ చైర్మన్లుగా ఎన్నికైన యరటపల్లి శివకుమార్ రెడ్డి, పఠాన్ నస్రీన్ ఖాన్ గార్లకు సూచించారు.బుచ్చి పట్టణ అభివృద్ధి దిశగా అడుగులేయాలని కోరారు. పదవులు రాని వారు నిరుత్సాహ పడవద్దని అర్హులకు తప్పక న్యాయం చేస్తానని హామీ యిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికై తాను నిత్యం అందుబాటులో వుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చి నగర పంచాయతి చైర్పర్సన్ మోర్ల సుప్రజ, తెలుగుదేశం నాయకులు ఎంవి శేషయ్య, బత్తుల హరికృష్ణ, యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, అడపాల అనీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లక్ష డప్పులు.... వేల గొంతులు కార్యక్రమంను విజయవంతం చేయండి
సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిటి సుబ్బయ్య మాదిగ
మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో లక్ష డప్పులు.... వేల గొంతులు కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నిర్వహిస్తున్నారని దీనికి నెల్లూరు జిల్లా నుంచి వేలాదిమంది మాదిగ నేతలు కార్యకర్తలు హాజరుకావాలని
సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిటి సుబ్బయ్య మాదిగ పిలుపునిచ్చారు. నెల్లూరు అంబేద్కర్ భవన్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.