ఉపాధి హామీ పథకం పై సమీక్షా సమావేశాలు నిర్వహించిన ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం,నాయుడుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం పై సమీక్ష సమావేశం ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, ఈ సమావేశం కార్యక్రమంలో ఎంపీడీవో శివప్రసాద్, సర్పంచులు, సెక్రటరీలు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,
డాక్యుమెంట్ మిస్సింగ్...
తిరుపతి జిల్లా :-
సూళ్లూరుపేట :- సూళ్లూరుపేట లో ప్రయాణిస్తూ ఉండగా డాక్యుమెంట్ మిస్ ఐనది. డాక్యుమెంట్ నెంబర్2179/2007 రిజిస్ట్రేషన్ లింకు డాక్యుమెంట్ ఆఫ్ ప్లాట్ నెంబర్ 23 కేశవరెడ్డి పళ్లెం, ముని కృష్ణమ నాయుడు డాక్యుమెంట్ మిస్ అయినట్లు ప్రకటన చేశారు. A, సమంత w/o T, హరీష్ బాబు సూళ్లూరుపేట లో డాక్యుమెంట్ పోయినట్టు ప్రకటన చేశారు. ఈ డాక్యుమెంట్ ఇచ్చిన వారికి బహుమతి ఇవ్వబడును. ఫోన్ నెంబర్ 8754494109, 9618621727
శ్రీసిటీని సందర్శించిన ఢిల్లీ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు
- శ్రీసిటీ ప్రత్యేకతలపై అధ్యయనం
- దేశంలోనే ఉత్తమ మోడల్ గా ప్రశంస
రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీసిటీ) :
గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (GNCTD) పరిశ్రమల శాఖ కార్యదర్శి, కమీషనర్ శ్రీమతి నిహారిక రాయ్, IAS, ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (DSIIDC) మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ మిట్టల్, IAS, మరో ఇద్దరు అధికారులు గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ వారికి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీ ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు, ప్రగతి, ప్రత్యేకతలు, వాణిజ్య అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు 'సులభతర వ్యాపారం'కి దోహదపడే అంశాల గురించి ఆయన వారికి వివరించారు.
శ్రీసిటీ అభివృద్ధి ప్రారంభ దశలలో ఎదుర్కొన్న కొన్ని సవాళ్లు, వాటి పరిష్కారాల మార్గాల గురించి వివరించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఏదైనా భారీ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేయడంలో తమ ఆలోచనలను అందించడానికి తాము సంతోషిస్తామన్నారు. ఈ సందర్శన గురించి వ్యాఖ్యానిస్తూ, ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు తమ ప్రాజెక్ట్ అమలు మోడల్‌ను ప్రస్తావించడం, అధ్యయనం చేయడం గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
భారీ ఇండస్ట్రియల్ పార్క్‌ని రూపొందించడంలో శ్రీసిటీ యాజమాన్య కృషిని నిహారిక రాయ్ అభినందించారు. శ్రీసిటీలోని అత్యున్నత సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోనే ఒక ముఖ్యమైన పారిశ్రామిక మౌళిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీసిటీ చక్కటి ఉదాహరణగా ఆమె ప్రశంసించారు.
కాగా, శ్రీసిటీ ప్రపంచశ్రేణి మౌళిక సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించడం మరియు శ్రీసిటీ సెజ్ లోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అభివృద్ధిని పరిశోధించడం ఢిల్లీ అధికారుల పర్యటన ఉద్దేశం. శ్రీసిటీ ఎండీ, ఇతర అధికారులతో సమావేశమైన వీరు, వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పర్యటనలో భాగంగా శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూడడంతో పాటు భారత్ ఎఫ్ఐహెచ్ (ఫాక్స్‌కాన్), CETC పరిశ్రమలను సందర్శించారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీ కాళహస్తి బైపాస్ రోడ్డు వద్ద, హంస బయో డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు, మరియు సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ, కిలివేటి సంజీవయ్య గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ,ఈ కార్యక్రమానికి వైయస్సార్ సిపి పార్టీ నాయకులు,కార్యకర్తలు, శ్రేయోభిలాషుల, తదితరులు పాల్గొన్నారు, అనంతరం నాయుడుపేట వైఎస్ఆర్సిపి సేవాదళ్ ప్రెసిడెంట్
హంస పృథ్వి చంద్ మాట్లాడుతూ ఇంత ప్రేమాభిమానాల తో ప్రారంభోత్సవానికి వచ్చిన వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసిన పృథ్వి, అలాగే అందరూ కలిసి నా వ్యాపార అభివృద్ధికి నాయుడుపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సహకరించాలని, హంస పృథ్వి చంద్ కోరారు
గూడూరు ఎస్. కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం స్థానిక ఎస్. కె. అర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక ప్రత్యేక కార్యక్రమము ఏర్పాటు చేయబడింది. కళాశాలలోని విద్యార్థులు కు, సిబ్బందికి యోగా శిక్షకులు ఎస్.వేకంటేశ్వర్లు గారి పర్యవేక్షణలో పలు రకాల యోగాసనాలను ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులను ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వర్లు యోగా వలన విద్యార్థులు మానసిక, శారీరక వికాసానికి యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. యోగా చేయడం వలన విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుంది అని పేర్కొన్నారు. అలాగే కళాశాలలో యోగా లో సర్టిఫికేట్ కోర్సును ప్రవేశ పెట్టుటకు అధికారాలకు ప్రతిపాదనలు పంపుచున్నట్లు తెలిపారు. తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ జి.ఝాన్సీ వాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమములో వైస్ ప్రిన్సిపల్ ఇ.విశ్వనాథ్, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి కె.పి.కృష్ణ మూర్తి, కళాశాల ఎన్.సి.సి. అధికారి డాక్టర్ కోటేశ్వరరావు, విభాగాధపతిపతులు డాక్టర్ కె.శివ ప్రసాద్, డాక్టర్ జి.సురేంద్ర, డాక్టర్ ఎం.డి. మక్సూద్ మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
శ్రీసిటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీసిటీ) :
శ్రీసిటీలో గురువారం 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో వేడుకగా, ఉత్సాహంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు విజిటర్స్ సెంటర్ ఆవరణలో జరిగిన యోగా కార్యక్రమంలో సుమారు 130 మంది పాల్గొన్నారు. శ్రీసిటీ డీఎస్పీ జగదీష్ నాయక్ ఇందులో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కాపాడుకోవడానికి యోగా చాలా అవసరమన్నారు. స్వంత ఆనందంతో పాటు సమాజ ప్రయోజనం కోసం అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని కోరారు.
నెల్లూరులోని ప్రణవ వెల్నెస్ సెంటర్ కు చెందిన యోగా గురువు వి.చంద్రశేఖర్, ఆయన శిష్యుడు భార్గవ కృష్ణ ప్రత్యేక అతిధులుగా పాల్గొని, కార్యక్రమంలో పాల్గొన్న వారికి సూర్య నమస్కారాలు, వివిధ శ్వాస వ్యాయామాల పట్ల శిక్షణ ఇవ్వడంతో పాటు యోగా వలన కలిగే పలు ప్రయోజనాలను వివరించారు.
యోగా దినాన్ని పురస్కరించుకుని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన సందేశంలో, యోగా ప్రాచీన భారతావని మానవాళికి అందించిన అమూల్య బహుమతి అని పేర్కొన్నారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పొందవచ్చన్నారు. దైనందిక జీవితంలో యోగాను ఒక భాగం చేసుకొని, తద్వారా మంచి ఆరోగ్యం, చక్కని మానవ సంబంధాలు, మంచి ఆలోచనలను పొందాలని ఆయన శ్రీసిటీ ప్రాంతవాసులకు సూచించారు.
శ్రీసిటీ జనరల్ మేనేజర్ సన్యాసిరావు ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్, శ్రీసిటీ సెజ్ కార్యాలయ స్పెసిఫైడ్ ఆఫీసర్ మధుబాబు, ఆథరైజ్డ్ ఆఫీసర్ రామారావు, రోటోలాక్ పరిశ్రమ ఎండీ ప్రసన్న, పలు పరిశ్రమల ఉద్యోగులు, విద్యార్థులు, పరిసర గ్రామస్థులు పాల్గొన్నారు.