నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో నిర్మాణం జరుగుతున్న స్పందన భవనాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు... జాయింట్ కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తో కలిసి బుధవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను పరిశీలించారు.. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా భవన నిర్మాణం జరుగుతుందా లేదా నన్న అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ నూతన భవనం లోనే జాయింట్ కలెక్టర్ చాంబర్ తో పాటు స్పందన హాల్, వివిధ చాంబర్ లు ఏర్పాటు చేయనున్నారు
నెల్లూరు జిల్లాలో ఓటర్ల జాబితా, ఈవీఎంల భద్రత తదితర అంశాలకు సంబంధించి జిల్లా ఉన్నత అధికారులకు సూచనలు జారీ చేసేందుకు నెల్లూరు నగరానికి విచ్చేసిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి విజయానంద్ కు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ,జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిలు స్వాగతం పలికారు . పుష్పగుచ్ఛం అందజేసి కాసేపు ఓటర్ల జాబితాకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు
సైదాపురం మం దేవరవేమూరు గ్రామ శివారుల్లో కోడి పందెం స్థావరాలపై దాడులు
సైదాపురం ఎస్సై ఎం.శివశంకర్ తన సిబ్బంది తో మండలం లోని దేవరవేమూరు గ్రామ శివారుల్లో కోడిపందెలు వేస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు జరిపి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారివద్ద నుండి 5 పందెం పుంజులు,రెండు సెల్ ఫోన్లు,4,200 రూ నగదుతో పాటు సంఘటన స్థలం లో 4 ద్విచక్ర వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు...
తీరు మార్చుకోండి,నిత్యం నిఘా ఉంటుంది జూదరులకు, అసాంఘిక కార్యకలాపాలు చేసే వారికి సైదాపురం ఎస్సై హెచ్చరిక
ఇప్పటికే మాధ్యమాల ద్వారా విలేజ్ పోలీసులు ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలకు కూడా అసాంఘిక కార్యకలాపాలకు,జూదాలకు,మత్తు పదార్థాలుకు దూరంగా ఉండాలని సూచనలు చేశామని ఎవరైనా చట్టవ్యతిరేకమైన పనులు చేసినా,చేయాలని చూసినా పోలీసుల నిఘా ఎప్పుడూ ఉంటుందని తప్పుచేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని,చట్టాల అమల్లో రాజీ లేదని ఎస్సై. ఎం. శివశంకర్ తెలియచేసారు...
కోట మండలం అల్లంపాడు గ్రామంలో నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం
డివిజన్ లో 25 వేల మంది పేదలకు ఇంటి నివేశన స్థలాలుపంపిణీచేయడంజరుగుతుందన్నారు.అల్లంపాడు గ్రామం లో నాలుగు ఎకరాల పట్టా భూమిని పేదల ఇళ్ల స్థలాల కు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శ్యాంప్రసాద్ రెడ్డి నీ సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ అభినందించారు.,
పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఒక భగవద్గీతగా ఒక ఖురాన్ గా ఒక బైబిల్ గా ఆచరిస్తూ పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు అని తెలిపారు,ఉన్న ఊరిని కన్న తల్లిని మరవను అనీ వెల్లడించారు.
గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి వైసీపీలో ఉంటూ కూడా పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు అన్నారు, ఈ నేపథ్యంలో అల్లంపాడు గ్రామంలో పేద ప్రజల కోసం 4 ఎకరాలు భూ దానం చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమాదేవి, ఎంపీడీవో భవాని ,వైకాపా నాయకులు దువ్వూరు వెంకటరమణా రెడ్డి ,దువ్వూరు సాయి కృష్ణారెడ్డి ,పి రాజా రామ్ రెడ్డి ,మల్లం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చిల్లకూరు కోదండరామిరెడ్డి , పాదర్తి రాధకృష్ణా రెడ్డి,మాజీ కోట మండల జడ్పిటిసి సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్ , వైకాపా నాయకులు ఇన్నమాల వెంకటాద్రి, ఉప్పల ప్రభాకర్ గౌడ్,వెంకు రెడ్డి,మధు రెడ్డి,సునిల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
🔹 32వ డివిజన్ లోని ప్రజలు ఏ అవసరం వచ్చినా రామకోటయ్య నగర్ లోని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది, అక్కడికి వెళ్తే మనకు సమాధానం చెబుతారు, మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనేలా రామకోటయ్య నగర్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వేదిక కావాలి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 32వ డివిజన్, రామకోటయ్య నగర్ లో ప్రారంభిచిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నగరంలోని అన్ని ప్రాంతాలకు ఆదర్శం కావాలి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నెల్లూరు జిల్లా:- సూళ్లూరుపేట మండల పరిధిలో ఉన్న మన్నెముతేరి గ్రామం నందు సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ఇల్లు పట్టాల కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ద్వారా పట్టాకి అర్హులైన ప్రతి పట్టాదారుకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్లో స్థలం, ఇల్లు లేని ప్రతి పేదవాడికి వైయస్సార్ పేద పట్టా కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అందించాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు .
➡️ మండల అధ్యక్షులు అనిల్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తన సొంత ఊరిలో తన సొంత భూమిని ఆ గ్రామంలో పేదవారికి నా ఆధ్వర్యంలో ఇవ్వడం నాకు ఎంతో గౌరవం గా ఉంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో DCMC డైరెక్టర్ జెట్టి వేణు యాదవ్, డివిజన్ అధికారి, సరోజిని, స్థానిక తాసిల్దార్ రవి కుమార్, మండల డెవలప్మెంట్ అధికారి నర్మద, హౌసింగ్DEE, AE, సచివాలయం సిబ్బంది మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మోహన్ రెడ్డి, చంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, కోడూరు రాశేఖర్, నెల్లూపూడి మణి తదితరులు పాల్గొన్నారు