ట్రంప్ ప్రధాన సలహాదారుడుకి పాజిటివ్
October 07, 2020
america
,
ap
,
covid-19
,
Nellore
,
stephen miller
,
trump
కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మరోసారి బరిలోకి దిగుతానని ఎమ్మెల్సీ రామకృష్ణ ప్రకటించారు. ఈ సారి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. 2015 మార్చిలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1800 ఓట్ల మెజారీటీతో గెలిచానని గుర్తు చేశారు. ఆ సమయంలో తనకు అందరూ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఏ ఆశయాలతో అయితే ఉపాధ్యాయులు తనను ఎన్నుకున్నారో వాటి సాధన కోసం నిరంతరం కృషి చేశానని చెప్పుకొచ్చారు. పాఠశాలల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి ఉపాధ్యాయుల అభివృద్ధి కోసం పని చేశానని అన్నారు. కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయులు తనను మళ్లీ గెలిపిస్తే గతం కంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని రామకృష్ణ పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
విశాఖలో మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరికి జీవీఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన కార్యాలయం అక్రమ కట్టడం అంటూ కూల్చివేశారు. దీంతో విశాఖలో సబ్బం హరి నివాసం వద్ద కొంత ఉద్రిక్తత నెలకొన్నది. సీతమ్మధారలో సబ్బం హరి ఇంటి వద్ద ఉన్న కార్యాలయాన్ని జీవీఎంసీ అధికారులు తొలగించారు. ఇంటిని ఆనుకుని ఉన్న టాయిలెట్‌ను కూడా కూల్చివేశారు. అయితే తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కార్యాలయాన్ని కూల్చడం ఏమిటని సబ్బం హరి అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతేకాదు కార్యాలయాన్ని ఎందుకు కూల్చుతున్నారో అధికారులు ముందుగా చెప్పలేదని..కూల్చివేతకు కారణాల్ని రాసివ్వాలంటే అధికారులు అసలు స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సబ్బం కార్యాలయాన్ని కూల్చుతున్నారన్నవిషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున సబ్బం హరి కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య గత కొన్నిరోజులుగా జల వివాదాలు నడుస్తున్న విషయం విదితమే. ఈ వివాదంపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జల వివాదాలను కేంద్రానికి ముడిపెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ భోజనం చేయగాలేనిది.. జల వివాదాలపై మాట్లాడటం చేతకాదా? అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కావాలనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారని ఆయన ఆరోపించారు.
కేంద్రం సిద్ధం..
'ఇద్దరు సీఎంలు కలిసి కూర్చుంటే మధ్యవర్తిత్వానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు మాట్లాడుకుంటే కేంద్రం అడ్డుపడిందా?. ప్రజలు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీని గుర్తిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికను బీజేపీ ఎదుగుదలకు ఉపయోగించుకుంటాం. ఉపఎన్నిక ఇన్చార్జ్గా జితేందర్‌రెడ్డిని నియమించాం. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మండలాల బాధ్యతలు అప్పగిస్తాం' అని కిషన్‌రెడ్డి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కీలక ప్రకటన చేశారు. ఇకపై ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని ప్రకటించే సంక్షేమ పథకాలు ఇకపై ఉండవని ప్రకటించారు. ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్న ధ్యేయంతోనే ముందుకు సాగుతామని ప్రకటించారు. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత మొదటి సారి హిమచల్ ప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అటల్ జీ టన్నెల్ ను ప్రారంభం అనేది అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్న లక్ష్యంతోనే జరిగిందని, దేశంలోని ప్రతి మూలకు, ప్రతి వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నదే తమ ధ్యేయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ఆయన దుమ్మెత్తి పోశారు. 'లాహుల్ స్పితి' వంటి కొన్ని ప్రదేశాలను ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని, ప్రజలే సొంతంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో కొన్నిజిల్లాలు రాజకీయ లాభాన్ని, సంక్షేమానికి దూరమయ్యాయని విమర్శించారు. కానీ తమ హయాంలో 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' అన్న నినాదంతో అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ఆయన తెలిపారు.
''ప్రభుత్వ పనివిధానంలో ఓ కొత్త మలుపు రాబోతోంది. ఇకపై ఓటుబ్యాంక్ ఆధారంగా పథకాలు ఉండవ్. ఇకపై అందరికీ అభివృద్ది ఫలాలు అందాలన్నదే తమ లక్ష్యం.'' అని మోదీ స్పష్టం చేశారు. దళితులకు, ఆదివాసీలకు, అణగారిన వర్గాల వారికి మౌలిక సదుపాయాను కల్పించడానికి సర్వధా ప్రయత్నిస్తూనే ఉన్నామని, అటల్ టన్నెల్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి దొరకుతుందని మోదీ తెలిపారు.
యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ఈనెల 4వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆదివారం ఉదయం 7.30గంటల నుంచి 9.30గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు సిటీ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. అభ్యర్థుల పరీక్షా కేంద్రాల వరకు ఈ బస్సులు నడుస్తాయన్నారు. ముఖ్యమైన బస్ స్టాపుల్లో అభ్యర్థులకు అవసరమైన బస్సుల సమాచారం తెలియజేసేందుకు సూపర్ వైజర్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.
విజయవాడ వైసీపీలో రచ్చ జరుగుతోంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతిస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, స్థానిక వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. నాటి నుంచి నేటి వరకూ వైసీపీ నేతలు, వంశీ మధ్య రెండ్రోజులకోసారైనా వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు అటు వంశీ.. ఇటు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు మీడియా మీట్ పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అందర్నీ కలుపుకునే వెళ్లే శక్తి తనకుందని వంశీ చెప్పగా.. ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుబట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను వంశీ ఇబ్బందిపెట్టాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా మరోసారి వంశీ-దుట్టా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం కాకులపాడులో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వివాదం నెలకొంది. వల్లభనేని-దుట్టా ఎదుటే ఇరు వర్గీయులు బాహాబాహీకి దిగారు. దీంతో కాకులపాడులో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గీయుల మధ్య మాటామాట పెరగడంతో అది కాస్త రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. ఈ ఘర్షణలో కొందరికి గాయాలైనట్లు తెలిసింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. చినికి చినికి గాలి వానగా మారుతున్న ఈ ఘటనలను వైసీపీ ఎలా హ్యాండిల్ చేస్తుంది?, జిల్లా మంత్రులు, ఇన్ చార్జిలు ఎలా సర్దిచెబుతారో చూడాలి.గన్నవరం నియోజకవర్గం నుంచి రెండుసార్లు టీడీపీ తరఫన గెలిచారు వల్లభనేని వంశీ. అయితే, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను, నేతలను ఇబ్బంది పెట్టారనేది గన్నవరం నియోజకవర్గ వైసీపీ నేతల వాదన. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని చక్రం తప్పి వంశీని వైసీపీ గూటికి చేర్చారు. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా ఆయన వైసీపీకే మద్దతిస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఆయనకు ప్రత్యేకంగా సీటు కేటాయించారు. ఈ అంశం వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుకు మింగుడు పడడం లేదనే వాదన ఉంది. అయితే, ఆయన్ను శాంతింపజేసేందుకు పార్టీ నేతలు యార్లగడ్డకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత నియోజకవర్గంలో వాతావరణం కొంత శాంతించిందనే అనుకున్నారు. అయితే, యార్లగడ్డ సైలెంట్‌గా ఉన్నా దుట్టా రామచంద్రరావు వర్గం ఇప్పుడు వంశీతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇవన్నీ నియోజకవర్గంలో పట్టుకోసం జరుగుతున్న ప్రయత్నాలేననే వాదన ఉంది.