నెల్లూరులో తొలి కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం
నెల్లూరులో తొలి కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం
గాంధీ బొమ్మ సెంటర్లోని స్వతంత్ర పార్కులో ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
తక్కువ స్థలంలో ఏర్పాటు చేసిన కంటైనర్ సబ్ స్టేషన్ తో ఎక్కువ గృహాలకు ప్రయోజనం
విద్యుత్ సరఫరా లో హెచ్చుతగ్గులను నివారించేందుకు ప్రత్యన్మయ మార్గం
కంటైనర్ సబ్స్టేషన్ ప్రయోజనాన్ని వివరించిన మంత్రి నారాయణ
నెల్లూరు [అర్బన్], రవికిరణాలు ఆగష్టు 30 :
అధునాతన టెక్నాలజీతో రూపొందించిన కంటైనర్ సబ్ స్టేషన్ తో ఎన్నో లాభాలు ఉన్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నడిబొడ్డున ఉన్న గాంధీ బొమ్మ సెంటర్, పొగతోట, ట్రంకు రోడ్డు, తదితర ప్రాంతాలలో విద్యుత్ హెచ్చుతగ్గులు నిరోధించడానికి కంటైనర్ సబ్ స్టేషన్ కు మంత్రి శనివారం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. 46 వ డివిజన్ గాంధీ బొమ్మ వద్ద ఉన్న స్వతంత్ర పార్కులో నాలుగు కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో ఏపీ ఎస్పీడీసీఎల్ సౌజన్యంతో కంటైనర్ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి విద్యుత్ శాఖ అధికారులు, టిడిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో తొలిసారిగా కంటైనర్ సబ్ స్టేషన్ను చేయడం జరిగిందన్నారు. ఇది పూర్తిగా రిమోట్ ఆధారిత సబ్ స్టేషన్ అని తెలిపారు. మామూలుగా విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు సుమారుగా ఐదు నుంచి పది ఎకరాల వరకు స్థలము అవసరం ఉంటుందని, అయితే సాంకేతికతను ఉపయోగించి అతి తక్కువ స్థలంలో కంటైనర్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కంటైనర్ సబ్స్టేషన్కు కేవలం నాలుగు లేదా ఐదు సెంట్లు స్థలంలో రూపకల్పన చేయడం జరిగిందని తెలిపారు. సుమారు కిలోమీటర్ పరిధిలో విద్యుత్ హెచ్చుతగ్గులు లేకుండా నిరంతర విద్యుత్తును అందించే విధంగా ఉపయోగపడుతుందన్నారు. సబ్ స్టేషన్ ద్వారా దాదాపు 5000 మంది వినియోగదారులకు ఉపయోగం కలుగునుందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ ,46వ డివిజన్ ప్రెసిడెంట్ కోకు మహేందర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ సత్యనాగేశ్వర రావు,కో క్లస్టర్ అజయ్,ఏపీ ఎస్పీడీసీఎల్ సూపరిండెంట్ ఇంజనీర్ విజయన్,టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.