నెల్లూరుజిల్లా.సూళ్లూరుపేట:-
పట్టణంలో ని PSR స్ట్రీట్ లో సునీల్ చిన్న పిల్లల హాస్పెటల్ ప్రక్కన ఫ్లెమింగో యాడ్స్ ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్ ను నూతనంగా ప్రారంభించారు, MLC వాకాటి నారాయణ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీ తో ఫ్లెమింగో యాడ్స్ ద్వారా నాణ్యమైన యాడ్స్, ఫ్లెక్సీ ప్రింటింగ్ అందుబాటులోకి ఫ్లెక్సీ మిషన్ ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద నగరాలకు దీటుగా గ్రామీణ,పట్టణ ప్రజలకు అందుబాటులో ఇక్కడ ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేయడం జరుగుతుందని నిర్వాహకులు కొమ్మల చంద్ర తెలియజేసారు.
కరోనా తో మృతి చెందిప పాత్రికేయుల కుటుంబాలకు సాయం అందంచాలి.
జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి హామీ కి జాప్ హర్షం
అదే బాటలో మిగిలిన సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలులో జా ప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి స్పష్టం
ఒంగోలు : కరోనా తో మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా సాయం అందించాలని జాప్ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా తో మృతి చెందిన పాత్రికేయులకేగాక అనారోగ్యంతో మృతి చెందిన వారికి జనవరి 15 వ తేదీని చెక్ లు పంపిణీ చేయనుంది.ఇదే బాటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాత్రికేయుల ను ఆదుకోవాలని జాప్ కోరుతోంది.రాష్ట్రంలో
పాత్రికేయుల కు స్ధలం కేటాయించడమే కాదు ఇళ్లు కట్టి ఇస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం పట్ల జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్ ) హర్షం వ్వక్తం చేసింది. ఇదే మాదిరిగా
ప్రభుత్వం జర్నలిస్టు వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి విలేకరులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి హితవు పలికారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అన్ని జర్నలిస్టు సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లాలలో పర్యటిస్తున్న జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డిని శనివారం సాయంత్రం ఓంగోలులో లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి వెంకారెడ్డి ఆధ్వర్యంలో కలిసి ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ లో ఎండీవీ ఆర్ ఎస్ పున్నం రాజు, ఎం యుగంధర్ రెడ్డి లసారథ్యంలో మాత్రమే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్( జాప్ )యూనియన్ ఒక్కటే ఉందని స్పష్టం చేశారు. మిగతా వ్యక్తులు జా ప్ పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్రంలోని జర్నలిస్టు సోదరులు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జాప్ పేరుతో తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులు తమసభ్యులు కాదని జర్నలిస్టులు గమనించాలని విజ్ఞప్తి చేశారు .జా ప్ ప్రతిష్టలకు ,నాయకుల గౌరవానికి భంగం కలిగేలా ఎవరైనా దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం అక్రిడేషన్ కమిటీ లకు ఇచ్చిన జీవో లో సైతం పున్నం రాజు, యుగంధర్ రెడ్డిల జా ప్ యూనియన్ కె గుర్తింపు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో దరఖాస్తు చేసిన విలేకర్ల అందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు ల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం వెంటనే మంజూరు చేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నీ జర్నలిస్టులoదరినీ ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించి, కరోనా ఆర్థిక సహాయం కింద ప్రత్యేకంగా ఆదుకోవాలని జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు .త్వరలోనే అన్ని జర్నలిస్టు సంఘాల తో కలిసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఉద్యమానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దగ్గుమాటి వెంకారెడ్డి ,గోపాల్,సుందరంవెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో PMESY నిధులతో ఏర్పాటు చేస్తున్న ఆమంచర్ల నుండి ములుముడి లింక్ రోడ్డు పనులను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాణ్యత ప్రమాణాలతో నిర్దిష్ట కాలంలో రోడ్డు పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారుల కోరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
అమరావతిలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం
అమరావతి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జస్టిస్ ఎన్వీ రమణ అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. రాయపూడి వద్ద సీజేఐకి అమరావతి ఐకాస రైతులు అపూర్వ స్వాగతం పలికారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. జాతీయ జెండాలతో ఆయనకు ఆహ్వానం పలికారు. అనంతరం హైకోర్టు ప్రాంగణంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను న్యాయవాదులు సన్మానించారు. సీజేఐ దంపతులను గజమాలతో హైకోర్టు సిబ్బంది సత్కరించారు
ఘనంగా 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పేద, బడుగు, బలహీన, రైతు, కార్మిక, కర్షక వర్గాల ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ అండగా ఉన్నదని సిపిఐ కావలి నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యం తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించి, జెండా ఆవిష్కరించారు.దేశ స్వాతంత్య్ర అమృతోత్సవం జరుగుతున్న వేళ, స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు, రాజ్యాంగ లక్ష్యాలు తిరుగమిస్తున్న వేళ, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలు కాపాడుతామని, లౌకిక వాద, సోషలిస్టు తరహా సమాజం, గణతంత్ర వ్యవస్థ నిర్మాణ లక్ష్యాలు కాపాడుతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డేగా సత్యం మాట్లాడుతూ ప్రపంచంలో కమ్యూనిస్టు పాలన ఉన్న ప్రతి దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. 97 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లవేళలా పేదలకు అండగా నిలబడిందన్నారు. ప్రజా సమస్యల కొరకు నిరంతరం పోరాటాలు చేస్తూ, బానిసత్వానికి వ్యతిరేఖంగా బ్రిటిష్ ప్రభుత్వాలను ఎదురించి పేదలకు అండగా నిలబడిందన్నారు. దున్నే వాడికి భూమి కావాలని పోరాటాలు చేశామని తెలిపారు. బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో ఎన్నో పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ చేసిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా పోరాటాలు చేస్తూ, ప్రజల పక్షాన నిలబడటం జరిగిందన్నారు. పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పసుపులేటి మహేష్, చేవూరు కొండయ్య, మల్లి అంకయ్య, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వంగవీటి 33వ వర్ధంతి వేడుకలు
వంగవీటి మోహన్ రంగా 33వ వర్ధంతి పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలి స్థానిక రైల్వే రోడ్డు లో గల "కారో నేషన్ రీడింగ్ రూమ్" నందు ఆదివారం నాడు కావలి వంగవీటి రంగా అభిమానులు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
వంగవీటి అభిమానులు కాపు తెలగ బలిజ సోదరులు పాల్గొని వంగవీటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ఆయనను స్మరించుకున్నారు
ఈ కార్యక్రమంలో మలిశెట్టి వెంకటేశ్వర్లు, దేవరకొండ శ్రీను ,అళహరి సుధాకర్ ,పద్మావతి శ్రీదేవి ,చింతాల వెంకట్రావు, దామిశెట్టి పూర్ణ చంద్ర రావు,కృష్ణ ,సిద్దు నాగా చారి ,జెన్నీ,మరియు అభిమానులు , తదితరులు పాల్గొన్నారు🍁
నెల్లూరు జిల్లా...గూడూరు రూరల్
పవన్ మృతదేహం లభ్యం
గూడూరు మం పోటుపాలెం పొలాల వద్ద పంబలేరు వాగు దాటుతూ ప్రమాదవశాత్తూ నీటిలో గల్లంతైన పోటుపాలెం గ్రామానికి చెందిన పవన్(20) అనే యువకుడు మృతదేహం లభ్యం....
ఈ ప్రమాదం శుక్రవారం నాడు జరగ్గా ఆరోజే భగవాన్ అనే వ్యక్తి మృతదేహం లభ్యం కాగా పవన్ ఆచూకీ లభించలేదు,ఈ రోజు పవన్ మృతదేహం ఆచూకీ లభించింది...
జిల్లా కలెక్టర్ KVN చక్రధర్ బాబు ,జాయింట్ కలెక్టర్ హరిందర్ ప్రసాద్,గూడూరు RDO వి.మురళీ కృష్ణ,గూడూరు DSP M. రాజగోపాల్ రెడ్డి, మత్య శాఖ JD ఆదేశాలు మేరకు పంబలేరు లో గల్లంతైన
పవన్ కోసం మత్య శాఖ AD చాంద్ బాషా గాలింపు చర్యలకై మరపడవ,గజ ఈతగాళ్ల సాయంతో ఫైర్ సిబ్బంది,పోలీసు సిబ్బంది సహకారంతో గాలించగా సంఘటన స్థలానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో పవన్ మృతదేహం లభించింది,,