కావలి టిడిపి కార్యాలయం లో yt నాయుడు గారి అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ
కావలి తో ఆయనకు విడదీయరాని సంబంధం ఉన్నది అని ఆయన రాజకీయ జీవితం ఎప్పుడు కష్టాలతో దురదృష్టం వెంటాడి త్యాగ శిలి గా నిలబడ్డారు అని ఆయన మరణం విచారకరం ఎప్పటికీ యువత కు ఆదర్శం గా మిగిలి పోతారు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వై.టి నాయుడు గారి మృతికి సంతాపం తెలియజేస్తూ వారి పార్ధీవదేహానికి పూలమాల వేసి నివాలర్పించిన మాజీ డీసీసీబీ చైర్మన్ , వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి గారు.
నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో టీడీపీ సీనియర్ నాయకుడు వైటీ నాయుడు భౌతికకాయానికి నివాళులర్పించిన పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ తదితరులు
వైటీ నాయుడు కుటుంబసభ్యులను పరామర్శించిన సోమిరెడ్డి
తెలుగుదేశం పార్టీకి వైటీ నాయుడు అందించిన సేవలు ఎనలేనివని, పార్టీ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
వాకాడు....హైదరాబాదులోని HACA భవన్ నందు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో "రెండు తెలుగు రాష్ట్రాల విత్తనాభివృద్ధి సంస్థలకు సంబంధించిన సమావేశము" లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య అతిథులుగా పేర్నాటి దంపతులు పాల్గొనడం జరిగింది.
కేంద్ర విత్తనాభివృద్ధి సంస్థ జాయింట్ సెక్రటరీ Dr.N విజయ లక్ష్మి గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి రైతులు కేంద్రం నుంచి వస్తున్న సబ్సిడీ గురించి చర్చించడం జరిగింది. విత్తన ఉత్పత్తికి సంబంచి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మనము పాలసీని ప్రవేశపెట్టపోతున్నాము అనే అంశంపై చర్చించడం జరిగింది. మన రాష్ట్రంలో 33 విత్తన నిల్వ మరియు శుద్ది గోదాముల గురించి వివరించడం జరిగింది. National Seed Export గురించి జాయింట్ సెక్రెటరీ గారు వివరించడం జరిగింది.
మన రాష్ట్రంలో, మన గౌరవ ముఖ్యమంత్రి గారు RBKల ద్వారా మనము ఏవిధంగా రైతులకు విత్తనాలు అందచేయబోతున్న విషయం కూడా చర్చించడం జరిగింది. Export & Import కు సంబంధించి రెండు రాష్ట్రాలు పడుతున్న ఇబ్బందులు గురించి జాయింట్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కొత్త రకం విత్తనాలకు సంబంధించి పూర్తిస్థాయిలో సబ్సిడీ ఇవ్వవలసిందిగా జాయింట్ సెక్రెటరీ గారిని కోరడం జరిగింది. విత్తనాభివృద్ధి కి సంబంధించి "Skilled Labour" అవసరం ఉంది కాబట్టి చర్చించడం జరిగింది. AP State Skill Development Corporation వారి సహాయముతో మన విత్తనాభివృద్ధికి సంబంధించిన వారిని ఎంపిక చేసుకోమని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కె. కోటేశ్వరరావు గారు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు గారు, తెలంగాణ అగ్రికల్చర్ కమిషనర్ కె.హనుమంతు గారు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.శేఖర్ బాబు గారు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దళిత నేతల సమావేశం వివరాలు
రాష్ట్రంలో గత రెండున్నరేళ్లలో దళితులపై జరిగిన దాడులు, సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న మోసం, దగాపై తెలుగుదేశం పార్టీ 29 ఎస్సీ నియోజకవర్గ ఇంఛార్జులు, నాలుగు పార్లమెంటు ఇంఛార్జులతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో దళితులపై దాదాపు 158 దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అరాచకానికి బాధితులుగా నిలిచిన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని నేతలు పేర్కొన్నారు. బాధితులందరికీ న్యాయం జరిగే వరకు ఐక్య పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
సంక్షేమ పథకాల పేరుతో హడావుడి చేస్తున్న జగన్ రెడ్డి.. రూ.4,426 కోట్ల సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లించి రాజ్యాంగ హక్కుల్ని తుంగలోతొక్కారు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దళితులకు ప్రాధాన్యత ఇవ్వకుండా రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహించారు. తెలుగుదేశం ప్రభుత్వం దళితుల సంక్షేమానికి, సాధికారతకు అనేక కార్యక్రమాలు అమలు చేసిందని, ఆస్తులతో కూడి సంక్షేమాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. కానీ.. గత రెండున్నరేళ్లుగా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఆస్తుల సృష్టి లేదన్నారు. పైగా సెంటు పట్టాల పేరుతో దళితుల నుండి దాదాపు 6వేల ఎకరాల అసైన్డ్ భూముల్ని, 2500 ఎకరాల లిడ్ క్యాప్ భూముల్ని స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దళితులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడి, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని నేతలు పేర్కొన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం దళితుల కోసం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమం ఉద్దరించేస్తున్నామంటూ జగన్ రెడ్డి ప్రచారం చేసుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని కూడా అమలు చేయలేకపోవడాన్ని ఆక్షేపించారు.
జగన్ రెడ్డి రద్దు చేసిన పథకాల వివరాలు :
1. ఎస్సీ సబ్ ప్లాన్
2. కేంద్ర ప్రాయోజిత పథకాలు నిర్వీర్యం
3. విదేశీ విద్య రద్దు
4. ఎస్సీ కార్పొరేషన్ల నిధుల మళ్లింపు
5. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు
6. గురుకుల, రెసిడెన్షియల్ స్కూల్స్ లో సీట్లు రద్దు
7. గ్రూప్స్, సివిల్స్ శిక్షణ కార్యక్రమాలు రద్దు
8. ఇంటి నిర్మాణానికిచ్చే అధనపు సహాయం నిలిపివేత
9. పెళ్లి కానుకలు రద్దు
10. పండుగ కానుకలు రద్దు
11. కౌలు రైతుల సంఖ్యను కుదింపు
12. కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాలు నిలిపివేత
13. దళితులకు భూమి కొనుగోలు, పంపిణీ, భూమి అభివృద్ధి కార్యక్రమాలు రద్దు
14. ఇళ్ల పట్టాల పేరుతో అసైన్డ్ భూముల ఆక్రమణ
15. ఎస్సీ, ఎస్టీ చట్టం నిర్వీర్యం, ఎస్సీలపై ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు
16. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలో ప్రాధాన్యత రద్దు
సంక్షేమ పథకాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం అంటూ చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. పైన తెలిపిన పథకాలు, కార్యక్రమాలపై సమాధానం చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. నాడు ఎన్టీఆర్ పేదల గుడిసెలను పక్కా ఇళ్లుగా మార్చారు. కొందరికే పరిమితమైన వరి భోజనం (స్వామి అన్నం) రెండు రూపాయలకే కిలోబియ్యం పేరుతో అందరికీ అందుబాటులోకి తెచ్చారు. గురుకుల పాఠశాలలు తెచ్చి నాణ్యమైన విద్యను దళిత బిడ్డలకు అందించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అందరికీ విద్యను.. అందరికీ విదేశీ విద్య అందించే స్థాయికి తీసుకెళ్లారు. దళిత పిల్లలను విదేశాల్లో చదివించారు. దళితుల సాధికారతకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచి, ప్రోత్సహిస్తే.. జగన్ రెడ్డి దళితులను ఓటు బ్యాంకుగా చూస్తూ.. సాధికారత, అభివృద్ధి అనే మాటే లేకుండా చేస్తున్నారంటూ నేతలు ఆగ్రహించారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, కె.ఎస్.జవహర్, పీతల సుజాత, పరసా వెంకటరత్నం, కోండ్రు మురళీ మోహన్, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, పాశం సునీల్ కుమార్, బొబ్బిలి చిరంజీవులు, తెనాలి శ్రావణ్ కుమార్, శ్రీమతి తంగిరాల సౌమ్య, కె. ఈరన్న, విజయ్ కుమార్, శ్రీమతి చిల్లా జగదీశ్వరి, అధికార ప్రతినిధులు జి.ఎరిక్సన్ బాబు, పిల్లి మాణిక్యరావు, మోకా ఆనంద సాగర్, సాంస్కృతిక సెల్ అధ్యక్షులు నరసింహ ప్రసాద్, వర్ల కుమార్ రాజా , సేవల దేవదత్ , జై రాజ్, చుక్క పురుషోత్తం, గుర్రాల రాజు విమల్ తదితర దళిత నేతలు పాల్గొన్నారు.
DR ఉత్తమ హోటల్ అంటే నాణ్యత మరియు రుచికరమైన భోజనానికి పెట్టింది పేరు...
నెల్లూరు నగర మిఠాయి ప్రియుల కోసం వీరు నూతనంగా ప్రారంభించిన స్వీట్స్ షాప్ ను చూస్తుంటే మెట్రో పాలిటన్ సిటీస్ లో ఉండే షాప్ ఉన్నట్టు ఉంది.. చూడగానే తినాలి అనిపించేలా ఉంది..
- అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్..
నెల్లూరు నగరంలో DR ఉత్తమ హోటల్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన DR ఉత్తమ స్వీట్స్ షాప్ ను మంగళవారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ గారు సందర్శించారు..
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ గారు మీడియా తో మాట్లాడుతూ...
నెల్లూరు నగరంలోని భోజన, మిఠాయి ప్రియుల కోసం DR ఉత్తమ వారు నూతన స్వీట్స్ షాప్ ను ప్రారంభించారు.DR ఉత్తమ హోటల్ అంటే నాణ్యత, రుచికరమైన భోజనానికి పెట్టింది పేరు...దాదాపు పది సంవత్సరాలు ఇంట్లో కంటే ఈ హోటల్ లోనే ఎక్కువగా భోజనం చేసేవారం.నా మిత్రులు దీపక్ రెడ్డి, వారి తండ్రి ధనుంజయ రెడ్డి రుచి లో నాణ్యత లో ఏ మాత్రం రాజీ పడరు...స్వయాన కిచెన్లోకి వెళ్లి ప్రతి ఆహార పదార్ధాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు.వీరు నూతనంగా ప్రారంభించిన స్వీట్స్ షాప్ ను చూస్తుంటే మెట్రో పాలిటన్ సిటీస్ లో ఉన్నట్టు ఉంది.. చూడగానే తినాలి అనిపించేలా ఉంది.దీపక్ నేను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, సొంత అన్నతమ్ముల కంటే ఎక్కువగా కలిసి మెలిసి ఉన్నాం.దీపక్ రెడ్డి వ్యాపారపరంగా ఇంకా ముందుకు సాగాలని, వ్యాపారం లాభసాటిగా ఉండాలని... రాజకీయాలకు అతీతంగా దీపక్ రెడ్డికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.పై కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్ పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వైటీ నాయుడు గారి భౌతికకాయానికి నివాళి అర్పించిన టీడీపీ నేతలు...
మంగళవారం నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్ సెంటర్లో గల టీడీపీ సీనియర్ నాయకులు వైటీ నాయుడు గారి భౌతిక కాయానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర,నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు,నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్,నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు,రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య,నన్నే సాహెబ్,జలదంకీ సుధాకర్,సాబీర్ ఖాన్,పమ్మిడి రవికుమార్ చౌదరి గార్లు నివాళి అర్పించారు...
ఈ సందర్భంగా బీద రవిచంద్ర గారు మీడియాతో మాట్లాడుతూ...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తులు వై టీ నాయుడు గారి మరణం బాధాకరం.ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న, ఎవరు ఆయనకి ఫోన్ చేసినా, ఆయన ఎవరికి ఫోన్ చేసినా, పార్టీ గురించే అడిగేవారు.జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవులు అనుభవించినా, స్థానిక రాజకీయాల వైపే ఎక్కువ మక్కువ చూపేవారు.ఏ పదవి లేకపోయినా ప్రజల గుండెల్లో వై టీ గా చిరస్థాయిలో నిలిచిపోయారు...ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వై టీ నాయుడు గారికి ప్రత్యేక స్థానం ఉంది. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది...
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ గారు మీడియాతో మాట్లాడుతూ....
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వైటీ నాయుడు గారితో నాకు సుదీర్ఘ పరిచయం లేకపోయినా, నేను తెలుగుదేశం పార్టీ లో చేరగానే ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను..తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడి గా ప్రకటించిన తర్వాతా మొట్టమొదటిగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను.. ఆయన ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీస్కుని ఆయన హావభావాలతో బాగా చేయమని ఆశీర్వదించారు.వైటీ నాయుడు గారి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు...వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది...
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సంధరర్భంగా కావలి ఫట్టణంలోని మానస థియేటర్ దగర ఉన్న మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న పదవి తరగతి విద్యార్థులకు కావలి మండల న్యాయ విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఈవిటీజింగ్, విద్యా హక్కు, తదితర చట్టా లపై పిల్లలకు న్యాయవాది మరియు పారా లీగల్ వాలంటీర్ ఐ.సాయి ప్రసాద్ అవగాహన కల్పించారు. అలాగే నేటి సాంకేతిక యుగంలో బాగా చదివి బాలుర తో పాటు బాలికలు కూడా పోటీ పడి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థినులను ఈ సందర్భంగాఆయన కోరారు. అదే విధంగా అక్కడ అందిస్తున్న ఆహారం,విద్య తదితర అంశాలను న్యాయవాది, పారా లీగల్ వాలంటీర్ ఐ.సాయి ప్రసాద్, అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలను శుభ్రం గా వుంచుకోవాలి అని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.సుబ్బారావు , టీచర్స్ అరుణ, సుజాత,కె.బి.కె. క్రిఫ్ట కుమార్ , పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.