నెల్లూరు నగరంలోని జనార్ధన్ రెడ్డి కాలనీ నందు పేదలందరికీ ఇచ్చే ఇళ్ళ స్థలాలను,
అలాగే పెన్నా బ్యారేజీ వద్ద జరుగుతున్న వారధి పనులను
అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు దేవరకొండ అశోక్, కొణిదల సుధీర్, వందవాశి రంగా,
నూనె మల్లికార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ :-
తద్వారా ఉమ్మడి లక్ష్యాల సాధన సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారత్ బలంగా విశ్వసిస్తోందన్నారు.
రాష్ట్రాల్లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి సైన్స్ అనేది ఏకీకృత సాధనమని స్పష్టం చేశారు.
ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్(ఐఐఎస్ఎఫ్)-2020లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆహ్వానం అందడం ఆనందంగా ఉంది.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన వివిధ ప్రముఖులు, మంత్రులు, నిపుణులతో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా.
ఇందులో పాల్గొన్న రాష్ట్రాల మంత్రులు.. కరోనా అనంతరం జీవనోపాధి అంశాలపై చర్చించారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలను పొరుగు దేశాలతో పంచుకోవడాన్ని భారత్ సదా విశ్వసిస్తుంది.
- డా.హర్ష వర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
ప్రజల ప్రతి సమస్యను సైన్స్ ద్వారా పరిష్కరించవచ్చని ఆరోగ్య మంత్రి అభిప్రాయపడ్డారు.
24,డిశంబరు:
రాష్ట్రంలోని వివిధ మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు నిత్యం పనిచేస్తున్న విధంగానే నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని
ఈనెల 31వతేది కూడా యదావిధంగా నిర్దేశిత సమయాల్లోనే పనిచేస్తాయని రాష్ట్ర బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి డి.వాసుదేవ రెడ్డి తెలియజేశారు.
రానున్న జనవరి 1వతేదీ నూతన సంవత్సరం సందర్భంగా
ఈనెల 31వతేదీన మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల వ్యాపార సమయాల్లో మార్పులు ఏమైనా ఉన్నాయాయని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి
తన కార్యాలయానికి అనేక ఫోన్ కాల్స్ వస్తున్న నేపధ్యంలో ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం దుకాణాలు ఉదయం 11గం.ల నుండి రాత్రి 9గం.ల వరకు,బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకూ పనిచేస్తున్న విధంగానే ఈనెల 31వతేదీన కూడా అదే సమయాల్లో యదావిధిగా పనిచేస్తాయని
ఈసమయాల్లో ఎలాంటి మార్పులు లేవని ఎండి వాసుదేవ రెడ్డి స్పష్టం చేశారు
గల్ఫ్ దేశం ఒమన్‌కు వెళ్లాల్సిన అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వారం రోజుల పాటు రెండు దేశాల మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఒమన్ వారం పాటు అన్ని దేశాలకు చెందిన విమానాలను మూసివేయాలని సుల్తానేట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిరిండియా విమానాలను రద్దు చేసింది. ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను కేంద్రం ఈ నెల 31వ వరకు రద్దు చేసింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయాలలో కొవిడ్ టెస్టులు నిర్వహిస్తామని, పరీక్షల్లో పాజిటివ్ వస్తే నిర్బంధ క్వారంటైన్‌కు పంపనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. సోమవారం అర్ధరాతి నుంచి యూకే నుంచి వచ్చిన విమానాలపై సస్పెన్షన్ విధిస్తుండగా.. ఈ ఏడాది చివరి రోజు అర్ధరాత్రి వరకు తాత్కాలిక నిషేధం కొనసాగుతుందని మంత్రిత్వశాఖ పేర్కొంది.
కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దాన్ని అరికట్టడానికి లండన్ సహా దక్షిణ ఇంగ్లాండ్‌లో లాక్డౌన్ విధించారు. కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ 70 శాతం ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోంది. బుధవారం నుంచి నమోదైన కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువే కొత్తరకం వైరస్ కేసులున్నాయి. ఇటలీలోనూ పూర్తిస్థాయి లాక్డౌన్ విధించారు. క్రిస్మస్ షాపింగ్ కోసం ప్రజలు బహిరంగంగా గుమిగూడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 24 నుంచి జనవరి 6 వరకు ఇటలీలో రెడ్‌జోన్ ప్రకటించారు. కొత్తరకం కరోనా వైరస్‌తో అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం కఠిన లాక్డౌన్ అమలు చేస్తోంది. క్రిస్మస్ వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అక్కడి టైర్-4 నిబంధనలను అమలు చేస్తోంది.
నిత్యావసరం కాని సరకుల దుకాణాలు, వ్యాపారాలు, వ్యాయామశాలలు, సినిమా హాళ్లు, సెలూన్లను రెండు వారాలు మూసివేశారు. దక్షిణ ఇంగ్లాండ్‌లో తాజా వైరస్ ఎక్కువగా ప్రబలుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. భారత్ కూడా నూతన రకం వైరస్ వ్యాప్తిని నివారించేందుకు సన్నద్ధమవుతోంది. యూకే పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి భయపడాల్సిందేమీ లేదనన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్. బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై భారత్ ఆంక్షలు విధించింది. డిసెంబరు 31వరకు బ్రిటన్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. యూకే నుంచి డిసెంబరు 22 అర్ధరాత్రిలోపు భారత్‌కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది. ఒకవేళ ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలితే వారిని ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపుతామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి తెలిపారు. పరీక్షల్లో వైరస్ నెగెటివ్ వచ్చినా కూడా ఆయా ప్రయాణికులు ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
జనరంజక నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సైదాపురం మండల కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆనం ::
✍️ జన నేత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Y.S జగన్ మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన సేవా కార్యక్రమాలను వారి జన్మదిన వేళ అభిమానులు, పార్టీ నాయకులు చేపట్టడం చాలా హర్షణీయమని
ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన జగన్ జన్మదిన వేడుకలను ఆర్భాటాలతో కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా Y.S అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించడం తనకు చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పేర్కొన్నారు