స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనలతో...
రాపూరు క్లస్టర్ 4ఇంచార్జ్ తిక్కమనేని ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక షాది మంజిల్ లో వార్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా రెండు రోజులు పాటు నిర్వహించారు...
ఈ కార్యక్రమంలో రాపూరు మండల టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రదర్శించిన వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని తిలకించారు...నాయకులు మీడియాతో మాట్లాడుతూ...టీడీపీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం మరియు మాహనాడు 44వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని రాపూరు మండలంలోని అన్ని క్లస్టర్లలో ఘనంగా నిర్వహించారు.1982లో ఎన్టీ రామారావు స్థాపించిన ఈ పార్టీ, అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన విషయాన్ని గుర్తు చేశారు.నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ వార్షికోత్సవాన్ని రాష్ట్ర పండుగలా అన్ని క్లస్టర్లలో జరుపుతున్నామని తెలిపారు. కులమతాలకు అతీతంగా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తోందని బీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాల అభ్యున్నతికి పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు...
ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ నాయకులు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి, వేదోటి కోటి నాయుడు ఎస్.కె కాజాముద్దీన్, నరేష్ నాయుడు, టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
Post a Comment