డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ.
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట :-
భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టకు సూళ్లూరుపేట మండల పరిధిలోని మన్నేముత్తేరి గ్రామంలో సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాల క్రితం మన్నే ముత్తెరి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని మాజీ సర్పంచ్ నెల్లిపూడి చెంగయ్య కన్న కలలను నేటికీ నెరవేరిందని ఈ విగ్రహ ప్రతిష్టకు తన వంతు సాయం చేస్తానని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టకు తోడ్పడాలనికోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ధర్మ పోరాట సమితి నాయకులు ఎర్రబోతు సుబ్రహ్మణ్యం, కన్నంబాకు మునుస్వామి (మాజీ ఉపాధ్యాయుడు), వీరయ్య, బూరగ మనోహర్, ఆవుల దాసు, పిండి పాలెం చెంగయ్య మరియు దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Post a Comment