జేడీ లక్ష్మీనారాయణ జనసే పార్టీలో ఉండుంటే ఆ పదవి వచ్చేది: పవన్ కళ్యాణ్

 జేడీ లక్ష్మీనారాయణ జనసే పార్టీలో ఉండుంటే ఆ పదవి వచ్చేది: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీని వీడిన నేతల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు పార్టీలోకి వచ్చారని గుర్తు చేశారు. ఆయనకు విశాఖపట్నం ఎంపీ టికెట్ ఇచ్చామని.. అయితే ఓడిపోయాక తాను సినిమాల్లోకి వెళ్ళిపోయానంటూ.. ఆయన బయటకు వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఒకవేళ తన వెంట నడిచి ఉంటేపార్లమెంట్ కి వెళ్లేవారేమో కదా అన్నారు.

తాను కులం కోసం రాజకీయాల్లోకి రాలేదని.. దేశం, రాష్ట్రం కోసం వచ్చానన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . కులాలు, మతాల గురించి మాడ్లాడుతుంటే విసుగొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కులం ముఖ్యం కాదని.. తన పక్కనున్న నాదెండ్ల మనోహర్‌ కమ్మ సామాజిక వర్గమని గుర్తు చేశారు. ఇంకా ఆ కులాన్ని దాటి వెళ్లలేరా.. ఓట్లు ఉంటే ఉంటాయ, పోతే పోతాయన్నారు. జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారని.. విశాఖపట్నం ఎంపీ స్థానం ఇస్తే ఓడిపోయారన్నారు. ఆ తర్వాత జేడీ సినిమాలు చేస్తున్నానని వెళ్లిపోయారన్నారు. అలాగే తోట చంద్రశేఖర్‌ బీఆర్‌ఎస్‌లో చేరారని... వాళ్లుంటే రాజసభ సభ్యులయ్యేవారేమోనని చెప్పుకొచ్చారు. తాను నాదెండ్ల మనోహర్‌ను నాయకుడిగా పెట్టుకుంటా.. ఎవరేం చేస్తారో చేసుకోండి అంటూ ఘాటుగా స్పందించారు.
12 ఏళ్ల తర్వాత తనను విమర్శించే కాపు నేతలకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని.. తాను కులం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తనను కులపరంగా తిట్టింది చాలని.. మాట్లాడితే వంగవీటి రంగా పేరును ఎందుకు తీసుకొస్తు్న్నారని ప్రశ్నించారు. వంగవీటి రంగా సతీమణి కమ్మ సామాజిక వర్గమని.. వారి ఇద్దరు పిల్లలు రెండు వర్గాలకు చెందివారవుతారని చెప్పుకొచ్చారు. తన భావజాలం నచ్చితే తనకు మద్దతు తెలపాలని.. లేకపోతే అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాల పరంగా ఉంటాయని.. ఇంకా కులాలుగా, ప్రాంతాలుగా వేరు చేస్తామంటే కుదరదన్నారు. తనను కుల నాయకుడిని చేయాలని అనుకుంటున్న వాళ్లంతా కలిసి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏకాభిప్రాయంతో నిలబెట్టాలని.. వారి వెనుక ఉన్న కుల నాయకుల సాయంతో సీఎం అయిపోండి అన్నారు.

తాను మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలని ప్రధాని దగ్గరకు వెళితే తన ఉరంగా కూడా తన వెంట రాదన్నారు పవన కళ్యాణ్. ప్రధానితో దేశ భవిష్యత్ గురించి మాట్లాడతానని.. అంతేకానీ ఎవరిని అరెస్ట్ చేయమని తాను కోరను అన్నారు. ఇదంతా వింటే హాస్యాస్పదంగా ఉందని.. తాను సనాతన ధర్మం గురించి మాట్లాడితే విమర్శించారని.. 33వేలమంది అమ్మాయిలు మిస్సింగ్ అంటే తనను విమర్శించారని.. కేంద్ర హోంశాఖ అమ్మాయిల అదృశ్యంపై నిర్థారించిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు ఎవరి వ్యక్తిగత జీవితం గురించి అవసరం లేదన్నారు. ఎమ్మెల్యేలు వ్యక్తిగత ప్రవర్తనతో ప్రతిష్ఠను దిగజార్చొద్దన్నారు. ఒకవేళ ఆయం లేకపోతే పార్టీలోకి రావొద్దని సూచించారు.

'కొంతమంది గుర్తింపు పొందాలని విశ్లేషణలు చేస్తుంటారు.. ఆయన పొరపాటున మాట్లాడి ఉండొచ్చు..అరెస్టు చేస్తామంటే వద్దని సూచించాను. మనోళ్లు కేసులు పెడితే వద్దని, వదిలేయమని చెప్పాను. కొంతమంది ప్రముఖ విశ్లేషకుల విశ్లేషణలకు అర్థంపర్థం లేకుండా పోయింది. మిమ్మల్ని తిట్టే వ్యక్తి ఇంట్లో పెళ్లికి మీరు వెళ్తారా? కానీ నేను వెళ్తాను. అంబటి రాంబాబు ఇంటికి కూడా పెళ్లికి వెళ్లాను. అది నా సంస్కారం. సీనియర్‌ విశ్లేషకుల్లాంటివాళ్లు ఒకటీ అరా పొరపాటు చేస్తారు. కానీ కొంతమంది అలాకాదు. నన్ను తిడుతున్నారు. బద్నాం చేస్తున్నారు. ఎన్ని రకాలుగా హింసించారంటే నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు. నాకు తెలుసు నన్ను విమర్శించేవారి గురించి నా దగ్గర కూడా చాలా సమాచారం ఉంటుంది. తోలు ఒలిచేయాలనిపించినా.. నా ప్రవర్తన, నా బిహేవియర్‌ నన్ను నడిపిస్తాయి' అన్నారు పవన్ కళ్యాణ్.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget