చెట్టుకు ఉరి వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట :-
సూళ్లూరుపేట పట్టణంలో యశోద టవర్స్ నెర్రి కాలవ మధ్య ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మృతదేహం పక్కనే ఓ దుకాణం ఉండటంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రులు తరలించి మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు.
Post a Comment