టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
తిరుమల, 2026 ఏప్రిల్ 24: హైదరాబాద్ కు చెందిన డాక్టర్ గీతిక సాయి శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు.
అదేవిధంగా హైదరాబాద్ కు చెందిన ఏసీఎస్ టెక్నాలజీస్ సంస్థ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
Post a Comment