డ్వాక్రా మహిళలకు అభయ హస్తం నిధులు వెనక్కి
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభయ హస్తం కింద డ్వాక్రా మహిళలు పొదుపు చేసిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అంగీకరించింది. 22 లక్షల మంది డ్వాక్రా మహిళలు 12 ఏళ్ల పాటు రూ.1,194 కోట్లు పొదుపు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1000 కోట్లు కలిపి మొత్తం రూ.2,194 కోట్లను 2021లో ఇతర అవసరాలకు మళ్లించింది. ఈ క్రమంలో డ్వాక్రా మహిళలు తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరారు. దీనికి ప్రభుత్వం అంగీకరించింది.
Post a Comment