11 మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు - బుల్లెట్‌ రైళ్లు నడిపేలా హైస్పీడ్‌ కారిడార్లు


 

11 మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు - బుల్లెట్‌ రైళ్లు నడిపేలా హైస్పీడ్‌ కారిడార్లు


రైలు అనుసంధానం లేని 11 మార్గాల్లో కొత్త లైన్ల నిర్మాణంపై రైల్వేశాఖ దృష్టి - మొత్తంగా 1,960 కి.మీ. మేర 26 ప్రాజెక్టులకు నివేదికల రూపకల్పన

రాష్ట్రంలోని ఒంగోలు నుంచి దొనకొండ, దూపాడు నుంచి బేతంచర్ల, మచిలీపట్నం నుంచి నరసాపురం, రేపల్లె వంటి ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్లు నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికలు సిద్ధమవుతున్నాయి. ఏపీ మీదుగా హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి చెన్నైలకు బుల్లెట్‌ రైళ్లు నడిపేలా హైస్పీడ్‌ కారిడార్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న మార్గాల్లో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండే వైపు అదనంగా మూడు, నాలుగు, ఐదు, ఆరో లైన్‌ నిర్మాణానికి డీపీఆర్‌లు తయారు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 1,960 కి.మీ. మేర 26 ప్రాజెక్టులకు రైల్వేశాఖ డీపీఆర్‌లు రూపొందిస్తోంది.

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ ఆరు డివిజన్లు ఉన్నాయి. పునర్విభజన తర్వాత సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్‌ డివిజన్లు దక్షిణ మధ్య రైల్వేలో మిగులుతాయి. విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు ఏపీలో విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా జోన్‌లోకి వెళతాయి. ఇందులో సికింద్రాబాద్, గుంతకల్, విజయవాడ, గుంటూరు డివిజన్ల సరిహద్దుల్లో మార్పులకు ప్రతిపాదనలు వెళ్లాయి.

మొత్తంగా 26 ప్రాజెక్టుల డీపీఆర్‌లు నవంబరు, డిసెంబరు నాటికి పూర్తిచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారు.

ప్రాజెక్ట్ కి.మీ. (ఏపీ పరిధిలో)

  • హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ 300
  • హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ 464
  • ఒంగోలు-దొనకొండ కొత్త లైన్ 87.45
  • దూపాడు-బేతంచెర్ల కొత్త లైన్ 47.61
  • మచిలీపట్నం-నరసాపురం కొత్త లైన్ 73.99
  • మచిలీపట్నం-రేపల్లె కొత్త లైన్ 45.30
  • బాపట్ల-రేపల్లె కొత్త లైన్ 45.81
  • పాలసముద్రం-నారాయణపురం కొత్త లైన్ 23
  • కాచిగూడ-చిట్యాల-జగ్గయ్యపేట కొత్త లైన్ 10
  • కొండపల్లి-సత్తుపల్లి కొత్త లైన్ 4.87
  • కొత్తగూడెం-కిరండోల్ కొత్త లైన్ 12.31
  • కొత్తవలస-అనకాపల్లి మధ్య బైపాస్ లైన్ 33
  • గుంతకల్లు వద్ద బైపాస్, రైల్ ఒవర్ రైల్ (ఆర్వోఆర్)వంతెన 12.20
  • పేరేచర్ల-మంగళగిరి మధ్య బైపాస్ లైన్, ఆర్వోఆర్ వంతెన 36
  • కాజీపేట-విజయవాడ మధ్య నాలుగో లైన్ 36
  • విజయవాడ-గూడూరు మధ్య నాలుగో లైన్ 293
  • గుంతకల్లు-బళ్లారి మధ్య నాలుగో లైన్ 24.21
  • వాడి-గుంతకల్లు మధ్య మూడు, నాలుగు లైన్లు 93.82
  • బంగార్పేట-జోలార్ పెట్టై నాలుగో లైన్ 30
  • గుమ్మడిపూండి-సూళ్లూరుపేట మధ్య మూడు, నాలుగు లైన్లు 18.40
  • సూళ్లూరుపేట-గూడూరు మధ్య మూడు, నాలుగు లైన్లు 55
  • అరక్కోణం-రేణిగుంట మధ్య మూడు, నాలుగు లైన్లు 43
  • గోపాలపట్నం-దువ్వాడ మధ్య మూడు, నాలుగు లైన్లు 10
  • సింహాచలం నార్త్-కొత్తవలస మధ్య ఐదు, ఆరు లైన్లు 16
  • రాయదుర్గం-తుముకూరు రెండో లైన్ 93
  • మలుగూరు-మడకశిర-హిరియూరు మధ్య రెండో లైన్ 52
  • మొత్తం 1,960 కిలో మీటర్లు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget