ఫైనాన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, మెంబర్ ఆఫ్ ఫైనాన్స్ కమిటీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం ఢిల్లీలోని సంవిధాన్ సదన్ లో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి ముందు ఫైనాన్స్ కమిటీ సభ్యులకు ప్రత్యేక ఫొటో సెషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫొటో సెషన్‌లో మిగతా కమిటీ సభ్యులతో ఆయన ఫొటోలు దిగారు. అనంతరం కమిటీ సమావేశంలో పాల్గొని వివిధ ఆర్థిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

Post a Comment