గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి



గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి


  •  అంగన్‌వాడీలంటే అమ్మ లాంటి సేవలు అందించేవారు
  •  సూపర్ సిక్స్ ద్వారా ప్రజలకు నిజమైన సంక్షేమాన్ని కూటమి ప్రభత్వం అందిస్తోంది. 
  •  అద్దె భవనాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. 
  •  గిరిజన ప్రాంతాలలో స్త్రీలు, పిల్లలకు సేవలందించే అంగన్వాడి సెంటర్లలో మౌలిక సదుపాయాలూ కల్పించండి. 
  •  శాసనసభలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 


ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేస్తున్నారన్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు. గురువారం శాసనసభ తొలి రోజు సమావేశాల సందర్భంగా ఆమె అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై గళమిప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ అంగన్వాడీలు అంటే అమ్మ లాంటి సేవలు అందించేవారని, పిల్లల ప్రథమ గురువుగా బాధ్యతలు నెరవేరుస్తున్న వారి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ టీచర్లు మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయవలసిందిగా ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఫేస్ యాప్, ఇన్ , అవుట్ లొకేషన్ విధానాలలో ఉన్న సాంకేతిక సమస్యల కారణంగా అంగన్వాడీలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె సభ దృష్టికి తెచ్చారు. 


అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం కోసం 4200 రూపాయల జీతాన్ని ఒక్కసారిగా 10500 రూపాయలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన GO Rt.No.116 కి సంబంధించి రాష్ట్రంలో ఉన్నమినీ అంగన్వాడీ  కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేయడంతో పాటు కొత్తగా 4687 హెల్పర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో యానాది తెగకు చెందిన గిరిజనులు ఎక్కువగా నివసించేది కోవూరు నియోజకవర్గంలోనేనని, 138 గిరిజన కాలనీలలో దాదాపు 35 వేల మంది గిరిజనులు నివసిస్తున్నారన్నారు. గిరిజన గర్భిణీ స్త్రీలు, పిల్లలు ఎక్కువగా అంగన్వాడీ కేంద్రాల మీద ఆధారపడి ఉంటారని, కోవూరు నియోజకవర్గ పరిధిలో 407 అంగన్వాడి సెంటర్లు ఉంటే వాటిలో 212 అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాలలో కొనసాగుతున్నట్లు చెప్పారు. 115 అంగన్వాడి సెంటర్లు అద్దె భవనాలలో ఉన్నాయని, మరో 80 అంగన్వాడి సెంటర్లు కొన్ని ప్రభుత్వ భవనాలలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారన్నారు. అద్దె భవనాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు ఏర్పాటు చేసి  ఉన్న భవనాలలో మౌలిక సదుపాయాలు కల్పించవలసిందిగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget