నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిది చారిత్రాత్మక విజయం

36 డివిజన్లలో వైసీపీ ఖాతా తెరవలేకపోయింది.. 

ప్రజల తీర్పును గౌరవిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు, రవి కిరణాలు:   నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి పార్టీలు చారిత్రాత్మక విజయం సాధించాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ పరిధిలోని 36 డివిజన్లలో వైసీపీ ఒక్క డివిజన్‌లో కూడా విజయం సాధించలేకపోయిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని, మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌కు ప్రజలు రికార్డు స్థాయి మెజార్టీ అందించారని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో రూ.966 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించిన ప్రజలు కూటమికి అండగా నిలిచారని అన్నారు. వైసీపీ మేయర్ అభ్యర్థి అనం విజయకుమార్ రెడ్డి తన సొంత డివిజన్‌లో కూడా విజయం సాధించలేకపోవడం ప్రజల తీర్పును తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలు అందించిన విజయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయబోమని, రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని స్పష్టం చేశారు. ఇకపై పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని నగర అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాము దౌర్జన్యాలకు పాల్పడి ఉంటే అనంతపురం, నాయుడుపేట ప్రాంతాల్లో కూటమి ఎందుకు ఓటమి పాలవుతుందని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు తమ విధులను సమర్థంగా నిర్వర్తించారని, ప్రజల తీర్పును గౌరవించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థే ఎన్నికల నిర్వహణ తీరును అభినందిస్తుంటే, ఓటమి పాలైన వారు విమర్శలు చేయడం సరికాదన్నారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నాయకులంతా అనం విజయకుమార్ రెడ్డి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.

మేయర్ రూప్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు :  ఈ సందర్భంగా నూతన మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు అఖండ మెజార్టీ అందించిన నెల్లూరు నగర ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందించిన సహాయ సహకారాలు, నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు చేసిన సేవలే తన విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నగర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget