విద్య – వసతి – వికాసం” కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళం


చెక్కును కలెక్టర్‌కు అందజేసిన ఎస్‌ఎన్‌జే గ్రూప్ చైర్మన్ జయమురుగన్

నెల్లూరు, రవి కిరణాలు:  జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, విద్యా సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించిన “విద్య – వసతి – వికాసం” కార్యక్రమానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది.  ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో ఎస్‌ఎన్‌జే గ్రూప్ చైర్మన్ జయమురుగన్ రూ.10 లక్షల విరాళానికి సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ దాతకు కృతజ్ఞతలు తెలుపుతూ, పేద విద్యార్థుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. విరాళాలు అందించదలచిన వారు జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మిని లేదా dbcweo.nlr.18@gmail.com, cpo_nlr@yahoo.co.in ఈ-మెయిల్ చిరునామాలను సంప్రదించాలని తెలిపారు.  ఈ కార్యాక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.శంకరయ్య, జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి శ్రీనివాసులు నాయుడు, జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget