డాక్టర్ ఎన్. ప్రభాకర్ నాయుడు సంతాప సభ కు హాజరైన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి

కావలి, రవి కిరణాలు  :    ప్రజా వైద్యుడిగా, ప్రజల మనిషిగా కావలి ప్రాంత ప్రజలకు విశేష సేవలందించిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎన్. ప్రభాకర్ నాయుడు మరణం కావలి డివిజన్‌కు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

డాక్టర్ ఎన్. ప్రభాకర్ నాయుడు చిత్రపటానికి నివాళులర్పించారు  ఈ సందర్భంగా కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ ఎన్. ప్రభాకర్ నాయుడుతో తనకు సుదీర్ఘమైన అనుబంధం ఉందన్నారు. 1989లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డాక్టర్ ప్రభాకర్ నాయుడు కావలి మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారని గుర్తుచేశారు. ఆ సమయంలో పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చిత్తశుద్ధితో పనిచేసేవారని తెలిపారు.  వైద్య వృత్తిని కేవలం వృత్తిగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావించి డాక్టర్ ప్రభాకర్ నాయుడు అనేక సంవత్సరాల పాటు ప్రజలకు సేవలందించారని కాటంరెడ్డి అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.  ప్రజలతో ఆత్మీయంగా మెలుగుతూ, అవసరమైన వారికి అండగా నిలిచే స్వభావం డాక్టర్ ప్రభాకర్ నాయుడు సొంతమని అన్నారు. వైద్యుడిగా, మున్సిపల్ చైర్మన్‌గా, ప్రజాసేవకుడిగా ఆయన అందించిన సేవలను కావలి ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని తెలిపారు.

డాక్టర్ ప్రభాకర్ నాయుడు మృతి తనను వ్యక్తిగతంగా తీవ్రంగా కలచివేసిందని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన మరణం కుటుంబ సభ్యులకే కాకుండా కావలి పట్టణం, కావలి డివిజన్ ప్రజలకు కూడా తీరని లోటని పేర్కొన్నారు.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, డాక్టర్ ప్రభాకర్ నాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన చూపిన సేవా మార్గాన్ని భవిష్యత్ తరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు.  మాజీ శాసన సభ్యులు, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు. శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి



Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget