ఈవీఎం గోడౌన్ తనిఖ

నెల్లూరు, రవి కిరణాలు :  భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  నెల్లూరు నగరంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో గల ఈవీఎం గోదాంను  గురువారం ఉదయం తనిఖీ చేశారు. రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి శ్రీ ఎస్. ఆంజనేయులు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లతో కలిసి ఈ తనిఖీలో పాల్గొన్నారు. 

ఈవీఎం గోదాం నెలవారీ తనిఖీలో భాగంగా గోడౌన్లకు వేసిన సీలు, సీసీ కెమెరాల పనితీరు మొదలైన భద్రతా పరమైన చర్యలను పరిశీలించారు. ఈవిఎం గోడౌన్  వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్, ఆర్డిఓ అనూష తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget