అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

 అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

ఎర్రగుంటలో యువనేతలు రాజగోపాల్‌రెడ్డి, శృతి పర్యటన





వెంకటాచలం,సెప్టెంబర్ 28, రవికిరణాలు : మండలంలోని సరస్వతీనగర్‌ పంచాయతీ పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శృతి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు...గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన యువనేతలు చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, కేంద్రంలోని వసతులపై ఆరా తీశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని రాజగోపాల్‌రెడ్డి, శృతి తెలిపారు. సౌత్‌ ఇండియా కంపెనీ సహకారంతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఇప్పటికే అవసరమైన పరికరాలను అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం సీఎస్‌ఆర్‌ నిధులతో అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

11వ బోరుతో తాగునీటి సమస్యకు పరిష్కారం

ఎర్రగుంట గ్రామ ప్రజల తాగునీటి అవసరాల కోసం గతంలో వేసిన పది బోర్లు విఫలమైనప్పటికీ, 11వ బోరు విజయవంతమై పుష్కలంగా నీరు లభించడంపై రాజగోపాల్‌రెడ్డి, శృతి ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం లభించడం సంతోషకరమన్నారు...హైవే పక్కన ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి ప్రహరీ నిర్మించడంతో పాటు గ్రామ శ్మశానవాటికలో అవసరమైన వసతులు కల్పించాలని స్థానికులు కోరగా, వాటిని ఏర్పాటు చేసేందుకు యువనేతలు హామీ ఇచ్చారు...అదేవిధంగా గ్రామంలో గుడులు, భజన మందిరాల నిర్మాణానికి ప్రజలు ముందుకు వస్తే శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా నిధులు మంజూరు చేయించేందుకు సహకరిస్తామని రాజగోపాల్‌రెడ్డి, శృతి తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని వారు పేర్కొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget