ఆత్మకూరు నుండి 20 వేల మందితో రామాపురం వైపు కదిలిన రామ దండు
-మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారధ్యంలో 359 బస్సులు,275 కార్లు
ఆత్మకూరు, రవి కిరణాలు :
ఆత్మకూరు నియోజకవర్గం నుండి వరికుంటపాడు మండలం రామాపురం లో జరిగే పల్లెపండుగ కార్యక్రమానికి దాదాపు 20 వేల మందితో రామాపురం వైపు ఆత్మకూరు దండు బయలుదేరారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో
పల్లె పండుగ సభకు కదిలిన రామదండు.గ్రామగ్రామాన పండుగ వాతావరణంలో భారీగా తరలిన ఎన్డీఏ కూటమి శ్రేణులు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిశానిర్దేశంలో స్థానిక నాయకులు భారీ జనసమీకరణ చేశారు.
రామాపురంలో జరుగుతున్న ‘పల్లె పండుగ’ భారీ బహిరంగ సభకు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి భారీగా తరలివెళ్లారు.తెలుగుదేశం,జనసేన,బీజేపీ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నియోజకవర్గంలోని గ్రామగ్రామాన పండుగ వాతావరణం నెలకొంది.
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిశానిర్దేశంలో,నియోజకవర్గంలోని మున్సిపాలిటీ,అన్ని మండలాలు, గ్రామాల నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 359 బస్సుల్లో 275 కార్లు,సుమారు 20 వేల మంది రామాపురం సభకు భారీగా తరలివెళ్లారు.
ఉదయం నుంచే గ్రామాల్లో కూటమి జెండాలు రెపరెపలాడగా, కార్యకర్తల నినాదాలతో సందడి నెలకొంది. ఆయా ప్రాంతాల నుంచి బస్సులు వరుసగా రామాపురం వైపు కదలడంతో ప్రధాన రహదారులన్నీ కూటమి శ్రేణులతో కళకళలాడాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనే పల్లె పండుగ సభను విజయవంతం చేయాలన్న సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజలు తరలివెళ్లారు . భారీ జనసమీకరణతో రామాపురం వైపు కదిలిన ఆత్మకూరు రామదండు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి పాల్గొనే పల్లె పండుగ విజయవంతానికి ఆత్మకూరులో భారీ జన సమీకరణ గావించారు.
మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఈ కార్యక్రమం ను ప్రతిష్టత్మాకంగా తీసుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామాపురంలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కే.పవన్ కళ్యాణ్ లు పాల్గొన్న పల్లె పండుగ కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గం నుండి భారీగా జనాలు తరలి వెళ్లేలా స్థానిక నాయకులు పట్టుదలగా ముమ్మరంగా సమీకరణ గావించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి తన నియోజకవర్గంలోని ఆత్మకూరు మున్సిపాలిటీ, ఆత్మకూరు,ఏఎస్పేట, అనంతసాగరం, మర్రిపాడు, సంఘం, చేజర్ల మండలాల్లోని నాయకులు అధికారులతో విడివిడిగా సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రణాళిక బద్దంగా నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి జనసేన బిజెపి శ్రేణులు వివిధ వర్గాల ప్రజలు తదితరులు అత్యధికంగా పాల్గొనేలా ప్రయత్నించారు . ఈ మేరకు ఆత్మకూరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీ, ఆరు మండలాల్లో తెలుగుదేశం నాయకులు తుమ్మల చంద్ర రెడ్డి, సుంకర పెంచలచౌదరి, కృష్ణారెడ్డి,సిరాజుద్దీన్, గంగాధర్ యాదవ్, బాణా శ్రీనివాసరెడ్డి, అబ్బూరు రమేష్ నాయుడు, ఆత్మకూరు మాజీ మండలాధ్యక్షుడు కేతా వేణుగోపాల్ రెడ్డి, నియోజకవర్గ సీనియర్ తెలుగుదేశం నాయకుడు కేత విజయభాస్కర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు, వివిధ స్థాయిలోని తెలుగుదేశం నాయకులు వార్డుల వారీగా గ్రామాల వారీగా జనసమీకరణ గావించారు. దాదాపు 359 బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు 275కార్లలో కూడా తరలి వెళ్లేలా ఏర్పాట్లు గావించారు. జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కార్యక్రమం జరగనుండగా సమీప నియోజకవర్గమైన ఆత్మకూరు నుండి అత్యధికంగా జనాన్ని సమీకరించి సత్తా చాటాలని, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలను శిరసా వహించాలని మున్సిపల్ మండల స్థాయి నాయకులు ప్రజా ప్రతినిధులు సొసైటీల అధ్యక్షులు తదితరులంతా అత్యంత శ్రద్దతో పట్టుదలగా కృషి చేశారు.


.jpeg)

Post a Comment