జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె డాక్టర్ లేడు
నెల్లూరు ప్రభుత్వ పెద్దాసుపత్రిలో కార్డియాలజిస్ట్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పనిచేసిన గుండె వైద్యుడు సెలవుపై వెళ్లినా, కొత్త నియామకం జరగకపోవడంతో గుండె సంబంధిత ఆపరేషన్లు నిలిచిపోయాయి. క్యాత్ ల్యాబ్ ఏర్పాటు కాలేదు. ECG సేవలు మాత్రమే అందుబాటులో ఉండటంతో రోగులు చికిత్స కోసం తిరుపతి, విజయవాడకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యపై ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ మాధవి కోరారు.
Post a Comment