రెడ్ అలర్ట్: ఏపీలో దంచికొడుతున్న ఎండలు
రాష్ట్రంలోని ఎండలు తీవ్రంగా ఉన్నాయి. శ్రీకాకుళం, కడప జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడంతో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించింది. తప్పనిసరి అయితే గొడుగు, టోపీ ధరించాలని, డీహైడ్రేషన్ నివారించడానికి నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.
Post a Comment