ఏఆర్‌హెడ్‌ క్వార్టర్స్‌లోని ఆయుధాల గది మరియు ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంను సందర్శించిన జిల్లా యస్.పి. శ్రీమతి డా.అజిత వేజెండ్ల,IPS

 


SPS నెల్లూరు జిల్లా,

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.18.09.2025.

ఏఆర్‌హెడ్‌ క్వార్టర్స్‌లోని ఆయుధాల గది మరియు ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంను సందర్శించిన జిల్లా యస్.పి. శ్రీమతి డా.అజిత వేజెండ్ల,IPS., గారు


ఏఆర్‌హెడ్‌ క్వార్టర్స్‌లోని ఆయుధాల గది, స్టోర్ రూమ్, అడిషనల్ యస్.పి.(AR), DSP(AR), ఆర్‌ఐ అడ్మిన్‌, ఆర్‌ఐ వెల్ఫేర్ గదులు మరియు ఇంటిగ్రేటెడ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ను సందర్శించిన జిల్లా యస్.పి. గారు.

బెల్ ఆఫ్‌ ఆమ్స్‌లో గల ఆయుధాల ఎన్ని ఉన్నాయి? ఏవేవి ఉన్నాయి? మందుగుండు సామాగ్రి, స్టోర్ రూమ్ లో గల అత్యవసర సామాగ్రి తదితర వస్తువులను పరిశీలించారు.

ఆయుధాలను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అనంతరం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి CC కెమెరాలు, LHMS, వీడియో వాల్, డయల్-112 కంట్రోల్ రూమ్ వ్యవస్థ పనితీరును పరిశీలన.

అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ CCTV కెమెరాలు, ఏవి పని చేస్తున్నాయి..? ఎక్కడెక్కడ పనిచెయ్యట్లేదు..? ఎందుకు..? వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆదేశాలు. 

డయల్-112 మరియు శక్తి యాప్ కాల్స్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, ఎటువంటి జాప్యం జరగరాదని, సౌకర్యాలు ఇంకా ఏమైనా కావాలా అని అడిగి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, క్రమశిక్షణతో విధులు నిర్వహించండని హెచ్చరికలు. 

బీట్ వ్యవస్థ, హైవే మొబైల్, VHF సెట్ మానిటరింగ్ లను పరిశీలించారు.

ఈ మధ్య కాలంలో CC TV పుటేజి ద్వారా చేధించిన కేసులను తెలుసుకొని, నేర నిరోధం మరియు ట్రాఫిక్ నియంత్రణ లో బాగా పని చేయాలని, సమర్ధతను మరింత పెంచుకోవాలని సూచనలు.

సమయపాలన పాటించండి.. విధులలో అలసత్వం వహిస్తే సహించేది లేదు. 

కంట్రోల్ రూమ్ వ్యవస్థ పనితీరు బాగుందని, పరిసరాలు శుభ్రంగా ఉన్నాయని అభినందనలు.

ఈ సందర్శనలో జిల్లా యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి CH.సౌజన్య గారు, AR DSP శ్రీ చంద్రమోహన్, RI వెల్ఫేర్ శ్రీ రాజారావు, RI MT శ్రీ హరిబాబు, PCR CI శ్రీ భక్తవత్సల రెడ్డి, PCR SI, RSI లు పాల్గొన్నారు.



Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget