అండమాన్ ద్వీపాలలో పరిశుభ్రత కార్యక్రమాలు
అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవాన్ని (సెప్టెంబర్ 20, 2025) పురస్కరించుకుని, హైదరాబాద్ లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (INCOIS) రెండు ముఖ్యమైన పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సముద్ర కాలుష్యం గురించి అవగాహన పెంచడం, సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించే అవసరాన్ని తెలియజేయడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం.
మొదటి పరిశుభ్రత కార్యక్రమం 2025 సెప్టెంబర్ 17న హవ్‌లాక్ ద్వీపం (స్వరాజ్ ద్వీపం)లో జరుగనుంది. ఇక్కడ INCOIS శాస్త్రవేత్తలు, స్థానిక స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి సముద్రగర్భంలో పెరుకుపోయిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించి, శుభ్రపరుస్తారు. ఈ ప్రయత్నం సముద్ర జీవరాశులు, స్థానిక పర్యావరణ వ్యవస్థలను రక్షించే ప్రయత్నాల్లో అత్యంత కీలకం.
రెండవ తీర పరిశుభ్రత కార్యక్రమాన్ని 2025 సెప్టెంబర్ 20న పోర్ట్ బ్లేయర్‌లో పాండిచ్చేరి విశ్వవిద్యాలయం సహకారంతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం తీరప్రాంతాలు, సముద్ర తీరం శుభ్రపరచడంపై దృష్టి పెట్టనుంది. ఇందులో INCOIS సిబ్బంది, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సేవకులు పాల్గొంటారు.
మన సముద్రాలు, తీర ప్రాంతాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల లక్ష్యం. కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రజలు వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఈ ప్రయత్నాల్లో భాగస్వామ్యం కావాలని INCOIS పిలుపునిస్తుంది.
కీలక వివరాలు:
*నీటి లోపల పరిశుభ్రత కార్యక్రమం:
తేదీ: 17 సెప్టెంబర్ 2025
ప్రాంతం: హేవ్‌లాక్ ఐలాండ్ (స్వరాజ్ ద్వీప్), అండమాన్ ఐలాండ్స్
* తీరప్రాంత పరిశుభ్రత కార్యక్రమం:
తేదీ: 20 సెప్టెంబర్ 2025
ప్రాంతం: పోర్ట్ బ్లెయిర్, అండమాన్ ఐలాండ్స్
ర్వాహకులు: INCOIS, హైదరాబాద్; పాండిచ్చేరి విశ్వవిద్యాలయం.

.jpeg)
Post a Comment