SPS నెల్లూరు జిల్లా:
తేది:17-09-2025
సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, మహమ్మదాపురం గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.గ్రామాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, యూరియా అందక, గిట్టుబాటు ధర లేక రైతులకు ఎదురవుతున్న గడ్డు పరిస్థితులు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించిన కాకాణి.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోగిరెడ్డి గోపాల్ రెడ్డి గారి తల్లి పెంచలమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న కాకాణి.
గ్రామాల్లో ప్రజలు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు.చంద్రబాబు సూపర్ సిక్స్ లో భాగంగా తాను ఇచ్చిన హామీలను కొన్నింటిని అసలు అమలు చేయకుండానే, మరికొన్నింటిని అరకొరగా అమలు చేస్తూ, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ సభలు, సమావేశాలు నిర్వహించడం హాస్యాస్పదం.చంద్రబాబు మాటల ముఖ్యమంత్రి కానీ, చేతల ముఖ్యమంత్రి కాదని రుజువు చేసుకున్నాడు.వరి పండించిన రైతులు గిట్టుబాటు ధర లేక నెల్లూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోతున్నారు.ధాన్యం రేట్లు రోజురోజుకి దిగజారి పోతున్నా, రైతుకు కనీస మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉల్లి ధర క్వింటాలు రూ౹౹3500/-లు ఉంటే, నేడు క్వింటాలు ధర 600/- రూపాయలకు దిగజారడం దౌర్భాగ్యం.రైతులు యూరియా అందక నానా అవస్థలు పడుతుంటే, చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతూ, కాలక్షేపం చేస్తున్నాడు.జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించి, నిర్మిస్తే, చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచి వేస్తుంది.చంద్రబాబు తన అనుకూల పత్రికల్లో ఎన్ని రకాల విష ప్రచారాలు చేసినా, పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం లేకుండా, వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లాడు. అనుభవజ్ఞుడు అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైంది.చంద్రబాబు లక్షల కోట్లు అప్పు తెచ్చి అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చేశాడు.చంద్రబాబు పాలన ప్రచార ఆర్భాటంలో "మిన్న" , కార్యరూపంలో "సున్న" అన్నట్లు తయారైంది.కూటమిపాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.ప్రతిపక్షంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, అన్ని విధాలా అండగా నిలుస్తాం.




Post a Comment