చట్ట వ్యతిరేక అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు



జిల్లా పోలీసు కార్యాలయం, తేది.15.09.2025.

 SPS నెల్లూరు జిల్లా

దర్గామిట్ట పోలీసు స్టేషన్ ను సందర్శించిన జిల్లా యస్.పి. శ్రీమతి డా.అజిత వేజెండ్ల,IPS., గారు
పోలీసు స్టేషన్ల పరిధులు, భౌగోళిక స్థితిగతులు, పరిసరాలను, పోలీసు స్టేషన్స్ మ్యాప్స్, చార్ట్ లను, రిసెప్షన్ గదిని పరిశీలించి, స్టేషన్స్ పరిధిలో ఉన్న నేర మరియు శాంతి భద్రతల పరిస్థితులను పరిశీలించిన యస్.పి. గారు.గత మూడు సంవత్సరాల కాలంలో క్రైమ్ ఏవిధంగా ఉందో రికార్డులను పరిశీలించి, తగిన ఆదేశాలు జారీ చేసారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ లు, సస్పెక్ట్ లు మరియు పాత నేరస్తులపై నిఘా పెంచాలి. క్రిమినల్ చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.హత్య, దోపిడీ, ఇతర తీవ్ర నేరాల కేసులలో ముద్దాయిలపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఆదేశాలు.యాక్టివ్ గా ఉన్న రౌడీ షీటర్స్ పై PD యాక్ట్ నమోదు చేయాలని ఆదేశాలు.చట్ట వ్యతిరేక అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు.విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ వ్యవస్థను ముమ్మరం చేయాలని, చైన్ స్నాచింగ్ నియంత్రణకు గట్టి ఆదేశాలు జారీ.మిస్సింగ్, బాడీలీ ఆఫెన్స్, మర్డర్, అనుమానాస్పద మరణాలు, హత్యాయత్నాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రాపర్టీ నేరాల నియంత్రణకు కృషి చేయాలి. దొంగతనం కేసులలో కోల్పోయిన ప్రాపర్టీ రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలి.నమోదైన కేసులలో దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించి, పలు సూచనలు చేసిన యస్.పి. గారు.అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ సమర్థవంతమైన సేవల ద్వారా జిల్లా పోలీస్‌శాఖకు మంచి గుర్తింపు తీసుకురావాలి.పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలకు స్పందించి, వారికి భరోసా కల్పించాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో రైటర్, అసిస్టెంట్ రైటర్ , కంప్యూటర్ ఆపరేటర్ , కోర్టు విధులు, సాధారణ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది తమకు కేటాయించిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి.ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది చక్కని యూనిఫాం ధరించాలని, సమయ పాలన పాటించాలని, జవాబుదారీతనంగా విధులు నిర్వహిచాలని ఆదేశాలు.పోలీస్ సిబ్బంది కేటాయించిన గ్రామాలు/వార్డులలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతల సమాచారాన్ని సేకరించి, ఎక్కడైనా ఏవైనా సున్నితమైన అంశాలు ఉంటే సదరు పోలీస్ స్టేషన్ అధికారి దృష్టికి తీసుకువచ్చి, వాటిని వేగంగా పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.పోలీసు స్టేషన్ సిబ్బంది యొక్క యోగ క్షేమాలు అడిగి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, DPO లో ఏమైనా ఫైల్స్ పెండింగ్ ఉన్నాయా అని అడిగి, వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు.పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యాచరణలు, నూతన ప్రణాళికలను అమలు చేస్తామని, ప్రతి వారం మెన్ గ్రీవెన్స్ ఉంటుందని, అందరూ వినియోగించుకోవాలని తెలిపారు.ఈ సందర్శనలో జిల్లా యస్.పి. గారితో పాటు టౌన్ DSP శ్రీమతి సింధు ప్రియ, SB DSP శ్రీ శ్రీనివాసరావు, దర్గామిట్ట CI శ్రీ రోశయ్య, SB CI-1 శ్రీ వెంకటేశ్వరరావు గార్లు మరియు సంబంధిత పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget