మెట్టప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే మెగా జాబ్‌మేళా
నెల్లూరు చేజర్ల, రవికిరణాలు జూలై 19 :
ఎన్డీఎ కూటమి నాయకులంతా సమష్టిగా జాబ్‌మేళా విజయవంతం కోసం పనిచేస్తున్నాం
ఆత్మకూరులో మీడియాతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
మంత్రి గారి కామెంట్స్
రాష్ట్ర స్కిల్‌డెవలప్‌మెంటు కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ సహకారంతో ఆత్మకూరులో మెగా జాబ్‌మేళాకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం
గతంలో ఎన్నడూ కూడా ఆత్మకూరులో ఇంత పెద్దఎత్తున జాబ్‌మేళా జరగలేదు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సతీష్‌రెడ్డి, మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జాబ్‌మేళాకు హాజరకానున్నారు
ఆత్మకూరులో ప్రభుత్వ ఐటిఐ, పాలిటెక్నిక్, ప్రైవేటు ఇంజనీరింగ్‌కళాశాలల్లో సాంకేతిక విద్యనభ్యసించి ఖాళీగా ఉన్న ప్రతిఒక్కరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్‌మేళా ధ్యేయం
సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా జాబ్‌మేళాలో పాల్గొంటున్నాయి.. సుమారు 300కి పైగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కూడా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి
జాబ్‌మేళా ఏర్పాట్లపై ఆర్డీవో గారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు... అధికారులందరితో మాట్లాడుతున్నారు
కళాశాలల వారీగా పాసై ఖాళీగా ఉన్న డేటాను సేకరిస్తున్నారు... అందరికి జాబ్‌మేళా సమాచారం అందిస్తున్నారు.
ఆత్మకూరులోని సాంకేతిక విద్య పాసై ఖాళీగా ఉన్న యువకులు, ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులందరూ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి.
Post a Comment