పర్యావరణ పరిరక్షణ పై అవగాహన సదస్సు నిర్వహించిన హోమియోపతి వైద్యులు కరుణాకర్
నెల్లూరు సిటి, రవికిరణాలు జూలై 19 :
స్వఛ్చ ఆంధ్ర కార్యక్రమాన్ని ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ ఇనమడుగు ప్రభుత్వ వైద్యులు డా కరుణాకర్ మరియు అతని వైద్యశిబ్బంది ఇనమడుగు గ్రామములో నిర్వహించడము జరిగింది. ప్రభుత్వ కార్యాచరణలో ప్రకటించిన విదముగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషెదిస్తు పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ప్రభుత్వప్రాధమిక పాఠశాలలో విధ్యార్ధులకు ప్లాస్టిక్ రకాలు ఏవి వాడోచ్చు ఏవి వాడకూడదో తెలుపుతు సింగిల్ ప్లాస్టిక్ వాడకము వల్ల పర్యావరణము ఎలా కలుషితమై అటు పర్యావరణము తద్వార మనిషి ఆరోగ్యము, జీవకోటి ప్రాణాలకు ముప్పు ఎలా కలుగుతుందో వివరించారు నేటి బాలలే రేపటి పౌరులు కనుక ఈ రోజు నెర్చుకున్న మంచి విషయాలను ఆచరిస్తె అంతా మంచి జరగడమె కాదు భావితరాలకు ఆదర్శముగా నిలుస్తారని చెప్పారు పర్యావరణాన్ని పరిరక్షించె బాధ్యతను ఈ రోజు నుండి తీసుకోవాలని డా కరుణాకర్ విధ్యార్ధులకు పిలుపునిచ్చారు అలానె విధ్యార్దులు మరియు ఉపాధ్యాయులు అక్కడ ఉన్న ప్రజలు చేత స్వచ్చాంధ్ర ప్రతజ్ఞను చేపించారు చెయ్యడమె కాదు ఈ రోజునుండి విధిగా ఆచరించాలని మరియు మీ ఇంటిలోని అందరిచెత అచరింపచెసెలా చైతన్యవంతులను చెయ్యాలని సూచించారు అలానె విధ్యార్ధులను ర్యాలిగా స్లోగన్స్ పలుకుతు ఇనమడుగు వీదుల్లో తిరుగుతు అందరిని చైతన్యపరిచారు ప్లాస్టిక్ వాడకము వద్దు ,ప్లాస్టిక్ పట్ల ఆకర్షణ వద్దు పర్యావరణాన్ని ప్రేమిద్దాము మనము ఆరొగ్యముగా ఆనందముగా జీవిద్దము అని పలికించారు అంతె కాకుండా సిబ్బందితో కలసి వైద్యపరిసరాలను శుభ్రముగా ప్లాస్టిక్ రహితముగా ఉంచుతు అక్కడికి వచ్చిన రోగుల చేత సిబ్బంది చేత ప్రతిజ్ఞ చెపించారు అక్కడి ప్రజలకు కూడ ప్లాస్టిక్ వాడకము తగ్గితె శరీరానికి వ్యాయమము అలవాటు అవుతుంది లేదంటె ప్లాస్టిక్ వాడకముతో మనుషులు సోమరిగా తాయరౌతున్నారని తద్వార బిపి షుగరు వస్తున్నాయని అలారాకుండా ఉండాలన్నా ,పర్యావరణ కాలుష్యము తగ్గి అందరు ఆనందముగా ఆరోగ్యముగా జీవించాలంటె ప్లాస్టిక్ వాడాకాన్ని నిషెదించాలని డా కరుణాకర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమములో డా కరుణాకర్ వైద్యసిబ్బంది కాంపౌండర్ బాష మరియు ఎమ్ న్ ఒ రామక్రిష్ణ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇనమడుగు ఉపసర్పంచి ,ప్రజలు పాల్గోన్నారు
Post a Comment