ప్రజా సమస్యల పరిష్కారమే ఇంటింటికి తెలుగుదేశం లక్ష్యం పెనుబల్లి గ్రామంలో 29 లక్షలతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంఖుస్థాపన

ప్రజా సమస్యల పరిష్కారమే ఇంటింటికి తెలుగుదేశం లక్ష్యం పెనుబల్లి గ్రామంలో 29 లక్షలతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంఖుస్థాపన 

విభేదాలు వీడి గ్రామాభివృద్ధికి పాటు పడండి

మనదంతా ఒకే గ్రూపు.. అదే చంద్రబాబు నాయుడు గ్రూపు 

గత ప్రభుత్వంలో టిడిపి కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు త్వరలోనే ఎత్తివేస్తామని మంత్రి లోకేష్ హామి యిచ్చి వున్నారు 

మంత్రి లోకేష్ ప్రవేశ పెట్టిన ఒన్ క్లాస్ ఒన్ టీచర్ విధానంతో ప్రభుత్వ విద్యా రంగానికి పూర్వ వైభవం

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి






నెల్లూరు [బుచ్చిరెడ్డిపాలెం], రవికిరణాలు జూలై 21 : 

ఓ వైపు అస్తవ్యస్తంగా వున్న రాష్ట ఆర్ధిక పరిస్థితిని సరిదిద్దుకుంటూ.. మరో వైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకుంటూ సుపరిపాలన అందివ్వడం సిఎం చంద్రబాబు నాయుడు కి మాత్రమే సాధ్యమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు . సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డి పాళెం మండలంలోని పెనుబల్లి, మినగల్లు విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించేందుకు ఇంటింటికెళ్లిన ఆమెకు మహిళలు మంగళ హారతులు పట్టి అభిమానం చాటు కున్నారు. ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా పలకరిస్తూ వారి సమస్యలు ఓపిగ్గా వింటూ ఇల్లిల్లూ తిరిగారు.పరిష్కారానికి అవకాశం వున్న సమస్యలను నాయకులును పురమాయించి అక్కడికక్కడే పరిష్కారం చూపారు.వివిధ సమస్యలకు సంబంధించి ఆమె ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా 29 లక్షలతో పెనుబల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఓవర్ హెడ్ వాటర్  ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఏ సమస్య వున్నా సంకోచించకుండా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలనుకోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రజల బాగోగులు తెలుసుకోవడం కోసమే  సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్నానన్నారు.విభేదాలు విస్మరించి ఐకమత్యంగావుంటూ గ్రామాభివృద్ధికి పాటు పడాలని ఆమె కార్యకర్తలకు హితవు పలికారు.గత ప్రభుత్వంలో టిడిపి కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు త్వరలోనే ఎత్తివేస్తామని మంత్రి లోకేష్ హామియిచ్చి వున్నారన్నారు.ఆడపడుచులా ఆదరించి తన విజయానికి కృషి చేసిన నాయకులు మరియు కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియచేసారు.పాత, కొత్త నాయకులు పరస్పర సమన్వయంతో భేషజాలు వీడి పని చేయాలని కోరారు.తాను ఎవరి పట్ల వివక్ష పాటించనని మనదంతా చంద్రబాబు నాయడు గ్రూప్ అని  ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు . వర్షాలు పడితే బురద మయంగా మారి విద్యార్థులకు అసౌకర్యంగా మారిన పెనుబల్లి హైస్కూల్ ప్లే గ్రౌండ్ లో గ్రావెల్ తోలిస్తానని హామీ యిచ్చారు. 

విద్యాశాఖ మంత్రి లోకేష్ సారధ్యంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పురోగతి సాధిస్తుందన్నారు. గతంలో నాలుగైదు తరగతులకు ఒకే టీచర్ ఉంటే ఇప్పుడు క్లాస్ కు ఒక టీచర్ నియామకం చేసాక ప్రజలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదించేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.నాణ్యమైన భోజనం,మరియు విద్యా కిట్లు అందచేసి ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేట్ పాఠశాలతో పోటీ పడేలా అభివృద్ధి చేశారన్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడాన్ని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.వయో వృద్ధుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 1 వ తేది ఆదివారం వస్తే ఒకరోజు ముందే పెన్షన్ పంపిణి చేస్తున్నామన్నారు.కుటుంబంలో ఎంతమంది పిల్లలు వుంటే అందరికీ తల్లికి వందనం పధకం అమలు చేశామన్నారు.అన్నదాత సుఖీభవతో పాటు ఆగస్టు 15 నుంచి మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత బస్సు సోకార్యం కల్పిస్తున్నామన్నారు.త్వరలో పేదలకు ఇళ్ళు,ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. స్థానిక నాయకులు ఇంటింటికి తిరిగి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తెలియచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బత్తల హరికృష్ణ,బిజెపి నాయకులు ఎంపీటీసీ వినయ్ నారాయణ, మహేంద్ర, ఓడ పెంచలయ్య, మినగల్లు సర్పంచ్ పూజిత, స్థానిక నాయకులు రాము, కోటంరెడ్డి శిరీష, ఆర్ డబ్ల్యు ఎస్  అధికారులు టిడిపి బూత్ కమిటి కన్వీనర్లు క్లస్టర్ ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget