43 డివిజన్ కు ఉపఎన్నికలు నిర్వహించాలని వినతి
నెల్లూరు, [కార్పోరేషన్], రవికిరణాలు జూలై 21 :
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 43 డివిజన్ కు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆ ప్రాంతవాసి ఆర్టిఐ సభ్యులు మొగల్ రబ్బానీ బేగ్ నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ. నందన్ కు వినతిపత్రం సమర్పించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బేగ్ మాట్లాడుతూ ఈ డివిజన్లో ఎన్నిక కాబడిన డిప్యూటీ మేయర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలకు ముందు రాజీనామా చేయడం జరిగిందని అన్నారు. అయితే అప్పటినుండి ఇప్పటివరకు 43వ డివిజన్ లో ఉప ఎన్నికలు జరపకపోవడం విశేషం అన్నారు. 16 నెలలైనా ఉప ఎన్నికలు జరగకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు 43 డివిజన్ కు కార్పొరేటర్ ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు .
Post a Comment