చుక్కల భూమి నుండి మాకు విడుదల చేయండి తాసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన బాధితులు.
కావలి, రవికిరణాలు జూలై 21 :
కావలి పట్టణంలోని కచ్చరమెట్ట ప్రాంతంలో కొన్ని సర్వే నెంబర్లకు సంబంధించిన ఇళ్ల స్థలాలు చుక్కల భూమి అని రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఆ ప్రాంతం వారు అనేకమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడ నివసించేవారు. బిడ్డల చదువుకి మరియు వారి బిడ్డల వివాహాలకు ఆర్థికంగా అవసరమయ్యే నగదును కావాలంటే ఆ గృహాలు అమ్ముకోవాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ గృహాలు చుక్కల భూముల్లో ఉన్నాయంటూ సంబంధిత అధికారులు చెప్పడం తో అక్కడ ప్రాంత ప్రజలు టిడిపి నాయకులు దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ఈ శ్రవణ్ కుమార్ ను కలిసి సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. అనంతరం డి.రతన్ ప్రసాద్ మాట్లాడుతూ, ఇక్కడ సుమారుగా 70 సంవత్సరాల నుండి నివసిస్తున్నామని, 2016 వరకు మా భూములకు రిజిస్ట్రేషన్ జరగడమే కాక బ్యాంకు నుండి రుణాలు కూడా తీసుకున్నామని తెలిపారు. కానీ 2016వ సంవత్సరం నుండి 2023వ సంవత్సరం వరకు చుక్కల భూమి అని రిజిస్ట్రేషన్ కాకపోవడంతో మానసికంగా మా కుటుంబాలు చాలా కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నామని,మా తల్లిదండ్రులైన పెద్దలు వారి ఆరోగ్యం సరిగా లేక వైద్యం కోసం అవసరమై అమ్ముకోలేక రుణాలు పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం వారు భూ సమస్యను తీర్చాలని కోరారు. అనంతరం సానుకూలంగా స్పందించిన తాసిల్దార్ శ్రావణ్ కుమార్ వీలైనంత త్వరలో ఉన్నత అధికారులకు నివేదికను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈదురు జైపాల్ ఇమ్మానియేల్, తా చిపూడి ప్రసాద్, కొణిదల మార్క్, సూరిపాగ సందేశ్, తాటిపర్తి ప్రసాద్, శాలెం రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment