పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలని కోటంరెడ్డి సంచలన నిర్ణయం!

ఎవరు గెలిచి వచ్చినా వారే నా మనుషులు.. గ్రామాభివృద్ధే లక్ష్యం

నెల్లూరు, రవి కిరణాలు:    ప్రతినిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ వార్తల్లో నిలిచే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమీపిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. గ్రామాల్లో ప్రజాదరణ ఉన్నవారు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, ప్రజల మద్దతుతో ఎవరు గెలిచి వచ్చినా వారిని తనవారిగానే భావించి స్వాగతిస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం.

గ్రామాల్లో నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకులు నేరుగా నామినేషన్లు వేసి ప్రజల మద్దతుతో విజయం సాధించాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా గ్రామాభివృద్ధి కోసం వారితో కలిసి పనిచేయడమే తన లక్ష్యమని ఆయన నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశంగా తెలుస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ జోక్యం కారణంగా వ్యక్తిగత విభేదాలు, వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుని స్థానిక ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  గ్రామాలు సున్నితమైన సామాజిక వ్యవస్థలని, రాజకీయాలకు అతీతంగా ప్రజల ఐక్యత, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నదే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా వారి తీర్పును గౌరవించి, గ్రామాల అభివృద్ధికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్ణయం ఇస్తోంది.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget