నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు

 

అన్ని వ్యతిరేక శక్తులను ఎదుర్కొని 1,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు

నెల్లూరు, రవి కిరణాలు:  నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో ఎదుర్కొన్న పరిస్థితులు, సాగించిన పోరాటంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. తనను వ్యతిరేకించే శక్తులన్నీ మదన్‌కు వ్యతిరేకంగా పనిచేసినా, ఒంటరిగా పోరాడి అద్భుత విజయాన్ని సాధించారని కొనియాడారు. 

ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. మదన్ కుమార్ రెడ్డిని ఓడించేందుకు బెంగళూరు నుంచి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని తీసుకొచ్చి, ఒక్కో ఓటుకు రూ.2 వేల చొప్పున విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ ఏకమై మదన్ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాయని పేర్కొన్నారు.

అయినప్పటికీ ఎవరిపైనా ఆధారపడకుండా, ఒంటిచేత్తో అన్ని సవాళ్లను ఎదుర్కొని నూకరాజు మదన్ కుమార్ రెడ్డి 1,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం అభినందనీయమని కోటంరెడ్డి అన్నారు. మదన్ పట్టుదల, పోరాట పటిమను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget