సర్వేపల్లి, రవి కిరణాలు : వరుసపెట్టి వైసీపీని వీడుతున్న కీలక నాయకులు, సీనియర్ కార్యకర్తలు. మనుబోలు మండలం కొమ్మలపూడి మాజీ సర్పంచ్ బందెల వేణుగోపాల్ నాయకత్వంలో 51 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక. అల్లీపురంలోని నివాసంలో జరిగిన కార్యక్రమంలో కొమ్మలపూడి నేత మన్నెమాల భాస్కర్ రెడ్డి ఆద్వర్యంలో అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కొమ్మలపూడిలో దాదాపు 90 శాతం మంది టీడీపీకి జైకొట్టడం శుభపరిణామం. ఒక్క కొమ్మలపూడే కాదు..వరకవిపూడి లాంటి గ్రామాల్లోనూ వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి టీడీపీలో చేరుతున్న వైసీపీ శ్రేణులకు సాదర స్వాగతం పలుకుతున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం జరుగుతున్నాయి...భూదోపిడీలు లేవు...ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. వైసీపీ పాలనలో ఇదే కొమ్మలపూడిలో కోట్లాది రూపాయల విలువైన 19 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలు సొంతం చేసుకున్నారు. రామదాసుకండ్రిగలోనూ ఎకరా రూ.1.50 కోట్లు పలికే 57 ఎకరాల భూమిని రూ.15 లక్షల చొప్పున అల్లుడి పేరుతో తీసేసుకున్నాడు. మరుపూరులో ఆదాయపు పన్ను చెల్లించే కోటీశ్వరుల కుటుంబానికి దాదాపు రూ.40 కోట్ల విలువైన 57 ఎకరాల భూమిని అప్పగించేశాడు. వైసీపీ నేతలు చెప్పినచోటల్లా సంతకాలు చేసిన పలువురు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది సస్పెండ్ అయ్యారు. ఓవైపు అనేక భూకుంభకోణాలకు పాల్పడి, మరోవైపు తోడేరులో 50 మంది బలహీనవర్గాల రైతులు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న 127 ఎకరాలకు కనీసం పట్టాలు ఇవ్వలేదు. తోడేరు మాత్రమే కాదు,..సర్వేపల్లి వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అర్హులైన పేదలందరికీ పట్టాలు మేం మంజూరు చేయిస్తాం. డేగపూడి – బండేపల్లి కాలువకు నేను నిదులు సాధించి పనులు మొదలు పెట్టించాను..వైసీపీ అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్లను తరిమేసి ఆ పనులను అడ్డుకున్నారు. పొదలకూరు మండలంలోని సోమశిల దక్షిణ కాలువదీ అదే పరిస్థితి. రైతులకు నీళ్లు రావడం, పేదలు సంతోషంగా బతకడం తోడేరు రెడ్డికి ఇష్టం లేదు. లెక్కకు మించి పాపాలు చేసి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేపల్లిలోని ఐదు జెడ్పీటీసీలు, ఐదు ఎంపీపీలు కూటమి పార్టీలు కైవసం చేసుకోవడం ఖాయం.








Post a Comment