తుమ్మల పెంట వాసికి వైద్య సహాయం అందించిన.... ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి

 - తుమ్మలపెంట గ్రామానికి చెందిన పామంజి గోవిందుకు వైద్య సహాయం మంజూరు..

- రూ.1,60,102.. LOC చెక్కును అందజేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..


కావలి, జూన్ 11:




ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రాధాన్యం అని మరోసారి చాటిచెప్పారు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చేయూత అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు.. కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామానికి చెందిన పామంజి గోవిందు వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అవసరమని తెలుసుకున్న ఎమ్మెల్యే,గుంటూరులోని అంజలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యుల సూచనల మేరకు రూ.1,60,102 విలువైన ఎల్.ఓ.సి (LOC) చెక్కును మంజూరు చేసి అందజేశారు.కావలి ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. డబ్బుల లేమి కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, అర్హులైన వారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే చొరవతో వైద్య సహాయం అందడంతో పామంజి గోవిందు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget